TTD: తిరుమల ఎగువ కనుమదారిలో శనివారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి తిరుమలకు వస్తున్న తితిదే ధర్మరథం బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును లింక్‌రోడ్డు సమీపంలో నిలిపివేశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇదీ చదవండి: