Fire Accident In Hotel: హైదరాబాద్ మలక్‌పేటలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ హోటల్‌లోని వంటగదిలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీనిపై హోటల్ సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో షాబుద్దీన్ అనే కార్మికుడు మృతి చెందినట్టు ఏసీపీ దేవేందర్ తెలిపారు.
దట్టమైన పొగలు వ్యాపించడంతో సమీప మలక్‌పేట ప్రభుత్వ ఆస్పత్రి రోగులు కొద్దిసేపు ఇబ్బందులు పడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న మలక్‌పేట ఎమ్మెల్యే.. ప్రమాదానికి గలకారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన హోటల్‌ను స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బలాలా పరిశీలించారు. కిచెన్‌లో విద్యుదాఘాతం కారణంగా ప్రమాదం జరిగిందా.. లేక గ్యాస్ లీకేజి కారణమా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
ఇవీ చదవండి: పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మైనర్ బాలికపై యువకుడి అత్యాచారం
'మై సెకండ్ వైఫ్' రెస్టారెంట్ యజమాని సూసైడ్.. భార్యతో గొడవే కారణం!