Father and Son Suicide Attempt: భువనగిరి కలెక్టరేట్‌లో తండ్రి, కుమారుడు ఆత్మహత్యాయత్నం చేశారు. కలెక్టర్ ఛాంబర్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆలేరు మండలం కొలనుపాకకు చెందిన ఉప్పలయ్య 20 ఏళ్ల క్రితం ఎనిమిది ఎకరాల భూమిని రూ.6000లకు కొనుగోలు చేశారు. దానిలో నాలుగు ఎకరాలకు పట్టాదారు పుస్తకం కోసం అప్లై చేయగా ఇప్పటికీ మంజూరు కాలేదు.
కలెక్టరేట్ చుట్టూ తిరిగిన పట్టాదారు పుస్తకం మాత్రం రాలేదు. దీంతో విసుగు చెందిన ఉప్పలయ్య ఈరోజు ఉదయం కుమారుడు మహేశ్‌ను తీసుకుని భువనగిరి కలెక్టరేట్ వద్దకు చేరాడు. తమ భూమికి పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వట్లేదని ఆరోపిస్తూ.. ఇద్దరు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. అప్రమత్తమైన స్థానికులు వారిని అడ్డుకున్నారు. అక్కడే ఉన్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: Shilpa chowdary cheating case: కోర్టులో శిల్పా చౌదరి హాజరు.. ఆమెపై మరో కేసు.!