ETV Bharat / crime

tragedy: అప్పుల బాధతో తండ్రి.. కూల్ డ్రింక్ అనుకొని కుమారుడు.. - తెలంగాణ వార్తలు

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొరసవాడలో విషాదం(tragedy in ap) నెలకొంది. అప్పుల బాధ తట్టుకోలేక కార్పెంటర్‌గా పనిచేస్తున్న వెంకటరమణ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శీతలపానీయం అనుకొని మిగిలిన విషాన్ని అతని ఇద్దరు పిల్లలు తాగారు. కుమారుడు నిహాల్ మృతిచెందగా... కుమార్తె యామిని పరిస్థితి విషమంగా ఉంది.

tragedy, father and son died
తండ్రీకుమారుడు మృతి, పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
author img

By

Published : Oct 4, 2021, 1:07 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొరసవాడలో విషాదం(tragedy in andhra pradesh) నెలకొంది. కార్పెంటర్‌గా పనిచేసిన వెంకటరమణ... ఉపాధి అవకాశాల్లేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. అప్పుల బాధ తాళలేక ఇంట్లో శీతల పానీయంలో పురుగుల మందు కలుపుని గురువారం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు అతణ్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆయన శుక్రవారం మృతి చెందారు.

కూల్​డ్రింక్ అనుకొని..

వెంకటరమణ తాగిన సీసాను ఇంట్లో పడి వేయడంతో... శీతల పానీయం అనుకొని... సీసాలో మిగిలిన విషాన్ని కుమారుడు నిహాల్, కుమార్తె యామిని తాగారు. చిన్నారులు అస్వస్థతకు గురికావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి కాస్త మెరుగుపడటంతో వైద్యులు పిల్లలను ఇంటికి పంపిచారు. శనివారం మధ్యాహ్నం పిల్లలకు వాంతులు రావడంతో విశాఖ కేజీహెచ్​కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కుమారుడు నిహాల్ ఆదివారం ప్రాణాలు కోల్పోయాడు. కుమార్తె యామిని పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స అందిస్తున్నారు.

చిన్నాభిన్నమైన కుటుంబం:

అసలే భర్తను కోల్పోయిన భార్య సుజాత పుట్టెడు దుఃఖంలో ఉండగా కుమారుడి మృతితో మరింత కుంగిపోయింది. ఒక్క రోజు వ్యవధిలో తండ్రి, కుమారుడు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆదివారం రాత్రి బాలుని మృతదేహాన్ని విశాఖపట్నం నుంచి కొరసవాడ స్వగ్రామానికి తీసుకువచ్చారు. ప్రస్తుతం కుమార్తె యామిని విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ అమీర్‌ అలి తెలిపారు.

ఇదీ చదవండి: Hot mail cyber crime: హాట్‌ మెయిల్‌ మెసేజ్​తో ఎర.. రూ.25 లక్షలు హుష్​ కాకి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.