ETV Bharat / crime

విద్యుదాఘాతంతో రైతు మృతి - విద్యుదాఘాతంతో రైతు మృతి

విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ విషాద ఘటన మెదక్​ జిల్లా పాపన్నపేట మండలం శానయిపల్లి గ్రామంలో జరిగింది.

Farmer dies of electric shock
మెదక్​ జిల్లాలో విద్యుదాఘాతంతో రైతు మృతి
author img

By

Published : Mar 29, 2021, 4:00 AM IST

పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతంతో మృతిచెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం శానయిపల్లి గ్రామంలో జరిగింది.

జిల్లాలోని పాపన్నపేట గ్రామానికి చెందిన నర్సింహులు (41) వరి పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లాడు. స్టార్టర్​కు విద్యుత్​ సరఫరా కాకపోవడంతో పక్కనే ఉన్న విద్యుత్​ నియంత్రిక వద్ద మరమ్మతు చేస్తున్నాడు. ఈ క్రమంలో షాక్​ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎంతసేపటికీ అతడు ఇంటికి రాకపోవడంతో పొలం వద్దకు వెళ్లి చూడగా అతని మృతదేహం కనిపించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: హోటల్​లోకి దూసుకెళ్లిన ట్రక్కు- 8మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.