ETV Bharat / crime

Fake Passport Gang Arrest: నకిలీ పాస్​పోర్ట్ ముఠా గుట్టురట్టు - ఆబిడ్స్ పోలీస్​స్టేషన్​ తాజా వార్తలు

Fake Passport Gang Arrest: నకిలీ పాస్​పోర్ట్, వీసాలతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఓ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడు నుంచి ఐదు పాస్ పోర్టులు, రెండు సెల్​ఫోన్​లు, లాప్​ట్యాప్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ ఘటన ఆబిడ్స్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది.

fake passport
నకిలీ పాస్​పోర్ట్​లు
author img

By

Published : Mar 6, 2022, 3:04 PM IST

Fake Passport Gang Arrest: నకిలీ పాస్​పోర్ట్, వీసాలతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఓ ముఠాను హైదరాబాద్ అబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. వాహబ్, మహహ్మద్ అబ్దుల్ జాకీ, ముఖీత్​లు సభ్యులుగా ఏర్పడి హైదర్ గూడ, బషీర్​బాగ్​లో టాలెంట్ కెరీర్ గ్రూప్​ను ప్రారంభించారు.

దుబాయ్​కి ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ కోసం కార్వాన్ కు చెందిన రఫీ అక్టోబర్ 2021లో మహ్మద్ అబ్దుల్​ను సంప్రదించాడు. అతని వద్ద 80 వేలు విమాన టిక్కెట్లుతో సహా అతడిని జాబ్ వీసాపై దుబాయ్ ఎక్స్ పోకి పంపుతామని గ్రూప్ నిర్వహకులు డబ్బులు వసూలు చేశారు.

The accused is Mohammad Abdul Jackie
నిందితుడు మహ్మద్ అబ్దుల్​ జాకీ

అనంతరం నకిలీ వీసాలు, ఆఫర్ లెటర్లు సృష్టించి ముంబై నుంచి దుబాయ్​కి టిక్కెట్లు బుక్ చేసి అతనికి అందించారు. నవంబర్ నెలాఖరులో మహమ్మద్ అబ్దుల్​ వైద్య పరీక్షల కోసం రఫీతో పాటు మరో ఐదు మందిని ముంబైకి తీసుకెళ్లాడు. అక్కడ వారికి టూరిస్ట్ వీసాలు ఇప్పించి టూరిస్ట్ వీసాపై దుబాయ్​కి పంపారు.

దుబాయ్ విమానాశ్రయంలో సంజు అనే వ్యక్తి కలవాలని తెలిపారు. అక్కడి వెళ్లాక మోసం చేశారని తెలుసుకున్న బాధితులు ఆబిడ్స్ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహ్మద్ అబ్దుల్​ జాకీని అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుడి నుంచి ఐదు పాస్ పోర్టులు, రెండు సెల్​ఫోన్​లు, లాప్​ట్యాప్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: పెట్రోల్ బంక్ ఘరానా మోసం.. డీజిల్​లో 75 శాతం నీరు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.