మెదక్ జిల్లా రేగోడు మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దైవదర్శనానికి వెళ్లి ఆటోలో తిరిగొస్తుండగా జరిగిన ప్రమాదంలో 8మంది గాయపడ్డారు.
మహా శివరాత్రి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన నర్సింలు... కుటుంబ సభ్యులతో కలిసి కామారెడ్డి జిల్లా బిచ్కుందలోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయానికి వెళ్లారు. దైవ దర్శనం చేసుకొని ఆటోలో ఇంటికి బయలుదేరారు. రేగోడు మండల కేంద్రం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో నర్సింలుతో పాటు అతడి భార్య, తల్లి, పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: ఆలయంలో అపశృతి.. బండరాయి పడి వృద్ధురాలి మృతి