హైదరాబాద్ జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ తాగుబోతు హల్‌చల్(DRUNKER HALCHAL) చేశాడు. మద్యం మత్తులో కౌకూర్ చౌరస్తాలోని 11 కేవీ విద్యుత్ స్తంభం(ELECTRICAL POLL) ఎక్కాడు. తను తాగేందుకు మద్యం కొనివ్వాలని... లేకపోతే కిందకు దూకేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. స్థానికుల సమాచారం మేరకు విద్యుత్ సిబ్బంది కరెంట్ సరఫరా నిలిపివేశారు.
ఎవరు ఎంతగా బతిమాలినా కిందకు దిగకుండా మందుబాబు నానా హంగామా చేశాడు. దాదాపు గంటపాటు విద్యుత్ స్తంభంపైనే ఉన్నాడు. స్థానికుల అభ్యర్థన మేరకు కిందకు దిగి వెళ్లిపోయాడు. దుండగుడు దిగి వెళ్లాక విద్యుత్ సిబ్బంది కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు.
ఇదీ చూడండి: COUPLE SUICIDE: కరోనా కాటుకు దంపతుల ఆత్మహత్య.. అనాథలైన పిల్లలు