Detonators explode in Rangareddy district: రంగారెడ్డిజిల్లా నార్సింగిలో డిటోనేటర్లు పేలి ఇద్దరికి గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరొకరికి గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రుల మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామని నార్సింగి ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
పేలుడు శబ్దాలు విని భయంతో స్థానికులు పరుగులు తీశారన్నారు. బాహ్యవలయ రహదారి పనుల్లో భాగంగా.. నాలా పనుల కోసం రాళ్లు తొలగిస్తుండగా ఘటన జరిగినట్లుగా వెల్లడించారు. ఇతర భవనాల నుంచి తెచ్చిన రాళ్లను గతంలో ఇక్కడ వేశారని.. బహుశా అందులోనే ఈ డిటోనేటర్లు ఉండవచ్చని ఇన్‌స్పెక్టర్ భావించారు.
"ఈరోజు ఉదయం 9గంటల 45 నిమిషాలు, 10 గంటల మధ్యలో 100 నుంచి ఫోన్ వచ్చింది. నార్సింగి సమీపంలో పేలుడు జరిగిందని సమాచారం వచ్చింది. అక్కడికి వెళ్లి చూస్తే పాత డిటోనేటర్లు పేలి ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించాము. వారు చెప్పిన సమాధానం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం."-శివకుమార్, నార్సింగి సీఐ
ఇవీ చదవండి: