జగిత్యాల బైపాస్ రహదారిలో లాక్‌డౌన్ విధులు నిర్వహిస్తుండగా బైక్పై వేగంగా వచ్చిన ఓ యువకుడు పోలీసులను ఢీ కొట్టాడు. ఘటనలో జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ, రూరల్ సీఐ కృష్ణ కుమార్లు స్వల్పంగా గాయపడ్డారు.
అక్కడే ఉన్న ఆముద రాజు, రాజశేఖర్ అనే యువకులు సైతం తీవ్రంగా గాయపడ్డారు. వారిలో రాజశేఖర్ కాలు విరిగినట్లు సమాచారం. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యాక్సిడెంట్ చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అడ్డుకుంటారనే భయంతోనే యువకడు వేగంగా వచ్చి ప్రమాదవశాత్తు ఢీ కొట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: Accident: కారును ఢీకొన్న డీసీఎం.. వ్యక్తి మృతి