Chili crop farmer suicide: తాను వేసిన మిరపపంటకు ఆశించిన దిగుబడి రాదని మనస్తాపానికి గురై రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రోటిబండ తండా గ్రామపంచాయతీ పరిధిలోని దూద్యా తండాలో చోటుచేసుకుంది.
తండాకు చెందిన బిక్కుకు... ఎకరం భూమి ఉండగా... మరో ఎకరా కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రూ. 3 లక్షల పెట్టుబడి పెట్టి రెండు ఎకరాలలో బిక్కు మిరప పంట సాగుచేశాడు. ఈ నేపథ్యంలో తోటకు పురుగు అంటుకుంది. ఎన్ని మందులు కొట్టినా పరిస్థితిలో మార్పు కనిపించలేదు.
ఇక తన పంటకు ఆశించిన దిగుబడి రాదని మనస్తాపానికి గురైన బిక్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యుల రోదనలతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుని కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని బంధుమిత్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎకరం భూమి ఉంది. మరో ఎకరం కౌలుకు తీసుకున్నాడు. అందులో మిరప పంట సాగు చేస్తున్నాడు. పంటకు పురుగు తగిలింది. ఎన్ని మందులు కొట్టినా పోవడం లేదు. పంట దిగుబడి రాదేమోనని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం నుంచి సాయం అందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి. అప్పుల బాధ తాళలేకనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
-- మృతుని బంధువు
ఇవీ చూడండి: