వరంగల్‌గ్రామీణ జిల్లాలో విషాదంచోటుచేసుకుంది. వరంగల్ నుంచి తొర్రూర్ వెళ్తున్నకారు పర్వతగిరి మండలం కొంకపాకవద్ద ఎస్సారెస్పీ కాల్వలో పడిపోయింది. కారులోనలుగురు ఉండగా ముగ్గురు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోాయారు. ఒకరిని స్థానికులు కాపాడారు. కాల్వలోప్రవాహం ఎక్కువగా ఉండటం వల్లవాహనం కొట్టుకుపోయింది. కారు కాల్వలో పడిపోగానే కారు డోరుతెరుచుకుని నీటిలోకి దిగారు. స్థానికులను గమనించి సాయం కోసం కేకలువేశారు. నీటిఉద్ధృతికి ఎదురీదేందుకు ప్రయత్నించారు.
గమనించిన స్థానికులు సహాయం చేసేందుకు రంగంలోకి దిగారు. తాళ్లతో కాపాడేందుకు యత్నించారు. నీటి ప్రవాహానికి ఎదురీదలేక బాధితులు కొట్టుకుపోయారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. మూడు మృతదేహాలను వెలికి తీశారు. భాస్కర్ అనే యువకుడిని ప్రాణాలతో కాపాడగలిగారు.
మృతుల్లో ఒకరు గుంటూరుపల్లిలో ఉపాధ్యాయురాలు సరస్వతిగా గుర్తించారు. కారులో లిఫ్ట్ అడిగి వెళ్తున్న ఆమె ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మిగతా మృతుల్లో శ్రీధర్, డ్రైవర్ రాకేశ్‌గా గుర్తించారు. ఘటనా స్థలాన్నిమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు.
ఇదీ చదవండి: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మందుబాబు హల్చల్