Car Burnt On Highway: ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉద్దండపురం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న రెండు కార్లు ఢీ కొన్నాయి. విశాఖ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న కారును.. అదే మార్గంలో వెళ్తున్న మరో కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ఘటనతో ఓ కారులో మంటలు చెలరేగాయి. అందులోని ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై బయటకు దిగటంతో.. తృటిలో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకొని మంటలార్పారు.
ఇదీ చదవండి : Karvy Scam Updates : కార్వీ సంస్థ స్థిరాస్తులను అటాచ్ చేసిన ఈడీ