సీబీఐ అధికారులమంటూ ఈ నెల 1వ తేదీన.. హైదరాబాద్ సుచిత్రలో నివాసముండే పద్మలత ఇంట్లో 19 మంది దాడి చేశారు. బ్లాక్ మనీ ఉందనే సమాచారం వచ్చిందంటూ ఆమెతో చెప్పి తనిఖీ చేశారు. సుమారు గంట పాటు వెతికినా... ఎలాంటి నగదు లభించకపోవడం వల్ల వెనుదిరిగారు. దాడిపై అనుమానం రాగా... వెంటనే పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పద్మలత తెలిపారు.
ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి పోలీసులు... నకిలీ సీబీఐ ముఠా సభ్యులంతా హైదరాబాద్‌కు చెందినవారని గుర్తించారు. వీరిలో ఒకరు పాత నేరస్థుడు ఉన్నట్లు తెలిపారు. ఆమె భర్తకు ఓ రైస్‌మిల్ ఉండడం వల్ల డబ్బు దొరుకుతుందని... పక్కా ప్రణాళికతో వారి ఇంటిపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. 19 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ