ETV Bharat / crime

ఏనుగుల దాడిలో పంట ధ్వంసం, మహిళ మృతి - elephants attacks in Vizianagaram district

ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రజల ప్రాణాలను, వారు పండించిన పంటను నాశనం చేస్తున్నాయి. ఈరోజు ఉదయం పాత కళ్లికోట గ్రామానికి చెందిన మహిళ తన పొలంలో కూరగాయలు కోయడానికి వెళ్లగా ఏనుగులు దాడి చేయడంతో మృతి చెందింది. ఇప్పటి వరకూ ఆ నియోజకవర్గంలో ఆరుగురు ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు.

elephant attack news, ap crime news
ఏనుగుల దాడిలో పంట ధ్వంసం, మహిళ మృతి
author img

By

Published : May 6, 2021, 12:56 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా కొమరాడ మండలం, పాత కళ్లికోట గ్రామానికి చెందిన అల్లాడ అప్పమ్మ (65) ఈరోజు ఉదయం సమీపంలో ఉన్న తమ పొలానికి కూరగాయలు కోయడానికి వెళ్లింది. ఏనుగుల దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. కురుపాం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏనుగుల దాడిలో ఆరుగురు చనిపోయారు.

అధికారులు పూర్తిగా ఏనుగులను తరలించలేని పరిస్థితి నెలకొంది. ఒకవైపు కరోనావైరస్ భయంతో ఇళ్ల దగ్గర ఉండే పరిస్థితి లేదని, మరోవైపు ఏనుగుల వల్ల తాము పండించిన పంట కూడా తెచ్చుకోలేక పోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్లికోట, గుణానుపురం, పరశురాంపురం, చంద్రంపేట గ్రామాల్లో ప్రజలు గడిచిన ఇరవై రోజులుగా ప్రజలు భయాందోళనకు గురవుతూనే ఉన్నారు. ఇంత జరిగినా జిల్లాస్థాయి అధికారులుగానీ, రాష్ట్ర స్థాయి అధికారులు గానీ పూర్తిస్థాయిలో ఏనుగులు ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికి తరలించే విధంగా పూర్తి స్థాయిలో పరిశీలన చేయటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

గడిచిన మూడున్నర సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. అటవీశాఖ అధికారులు ఏనుగుల వెనకాల తిరగడమే తప్ప పరిష్కారం ఎక్కడ అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. చనిపోయినవారికి నష్టపరిహారం ఇవ్వడం, పంట నష్ట పోయిన వారికి నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలానే కొనసాగితే పండించిన పంటలకు, తమ ప్రాణాలకు భరోసా ఎలా అంటూ నిలదీస్తున్నారు. అడవి శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఏనుగులు ఎక్కడి నుండివచ్చాయో.. అక్కడికి తరలించి ఈ ప్రాంత ప్రజల ప్రాణాలను, వారు పండించిన పంటలను కాపాడాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: ఊపిరి అందట్లేదు.. నా భార్య జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.