ETV Bharat / crime

Allegations on Vanama Raghava : రాఘవ దందా రాజ్యం.. భూ వివాదాలకు కేరాఫ్‌!

నాలుగు దశాబ్దాల రాజకీయం. గ్రామ సర్పంచ్‌ స్థాయి నుంచి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన నేత. 4 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన అనుభవం. తమ ప్రతినిధిగా ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర.... వెరసి పుత్రరత్నం తెచ్చిన తలవంపులు మాయనిమచ్చను మిగిల్చాయి. రాష్ట్రంలో సంచలనంగా మారిన పాల్వంచ ఘటనలో తన కుమారుడే ప్రధాన నిందితుడు కావటంతో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు రాజకీయ జీవితాన్నే మసకబారేలా చేసింది. ఈ ఘటనతో రాఘవ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. రాఘవ దందాలు బయటపడుతున్నాయి.

Allegations on Vanama Raghava, palvancha case
రాఘవ దందా రాజ్యం
author img

By

Published : Jan 8, 2022, 10:35 AM IST

నాలుగు దశాబ్దాల రాజకీయం జీవితం. గ్రామ సర్పంచి స్థాయి నుంచి రాష్ట్ర మంత్రిగా ఎదిగారు. కొత్తగూడెం నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వనమా వెంకటేశ్వరరావు రాజకీయ జీవితంలో పలు ఎత్తుపల్లాలు చూశారు. కుమారుడు రాఘవ రూపంలో ఎప్పుడూ తలనొప్పులు తప్పలేదు. సంచలనంగా మారిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో కుమారుడు ప్రధాన నిందితుడిగా నిలవడంతో ఈసారి ఏకంగా తలవొంపులే వచ్చాయి. తాజా ఉదంతం వెంకటేశ్వరరావుకు రాజకీయంగా తీవ్ర ప్రతికూలంగా మారింది. నియోజకవర్గంలో నిన్నటి వరకూ అన్నీతానై చక్రం తిప్పిన కుమారుడి ఆగడాలు రాష్ట్ర వ్యాపితంగా వెలుగుచూడటం, ఏకంగా అధికార పార్టీ నుంచి శుక్రవారం అతణ్ని సస్పెండ్‌ చేయటం, పోలీసులు అరెస్టు చేయటం చిక్కులు తెచ్చిపెట్టాయి.

నియోజకవర్గంలో భూ తగాదా ఎక్కడుంటే అక్కడ అతని నీడ పడుతుంది. సెటిల్‌మెంట్‌ ఏదైనా అంతా ఆయన ఛాయలోనే. తన మాటే శాసనం. ధిక్కరించిన కుటుంబాలకు దక్కేది వినాశనం. ప్రశ్నిస్తే వేధింపులు, ఎదిరిస్తే భౌతికదాడులు, ఇదే అనైతిక లోకంలో సృష్టించుకున్న అరాచక రాజ్యాంగం నియమాలు. కొన్ని వ్యవస్థలు.. ఆయన అడుగులకు మడుగులొత్తే తొత్తులు.
- ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్రరావు అలియాస్‌ రాఘవ గురించి బాధిత కుటుంబాల ఆవేదనలోని సారాంశమిది.

* పాల్వంచలో పలు ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను కబ్జా చేసి బినామీలు, కొందరు కుటుంబ సభ్యులపై రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. నవభారత్‌, పాలకోయతండా, మంచికంటినగర్‌, రామస్వామి గుంపు, బంగారుజాల ప్రాంతాల్లో రూ.కోట్ల విలువైన ఎకరాల కొద్దీ భూములు ఆయన కబ్జాలోనే మగ్గుతున్నట్లు తెలుస్తోంది.

రాఘవ దందా రాజ్యం

* ‘నాకు, ఓ సామాజిక వర్గం వారికి భూ వివాదం తలెత్తింది. దీంట్లో రాఘవ జోక్యం చేసుకున్నాడు. స్థలం చేజిక్కితే కొంత వాటా ఇస్తామని ఆయన్ను ప్రత్యర్థులు ప్రలోభపెట్టారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో నాపై అనుచరులతో దాడిచేయించి భయపెట్టాడు. మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశా. అయినా వదలడం లేదు.’

- కొత్తగూడేనికి చెందిన బాధితుడు

* ‘కొత్తగూడెం పురపాలకంలో క్రమబద్ధీకరణ జీవోను అడ్డుపెట్టుకుని వనమా తనయుడు దందా చేస్తున్నాడు. వాణిజ్య స్థలాలపై కన్నేశాడు. అడిగినంత ఇస్తే పట్టాలిప్పించడం.. లేదంటే దరఖాస్తు పెండింగ్‌లో పెట్టించడం చేస్తున్నాడు. నన్ను రూ.7 లక్షలు డిమాండ్‌ చేశాడు. అంగీకరించకపోవటంతో పట్టా రాకుండా అడ్డుకున్నాడు’.

- క్రమబద్ధీకరణ దరఖాస్తుదారుడు

* ‘మా నాన్న ఎప్పుడో కొనుగోలు చేసిన ఇళ్ల స్థలం అది. అన్ని ధ్రువపత్రాలున్నాయి. అది మా స్థలం కాదంటూ రాఘవ పంచాయితీ పెట్టాడు. భూమి ఖాళీ చేయాలని బెదిరించాడు. సెటిల్మెంట్‌కి వస్తే ఆలోచిస్తానన్నాడు. అడిగినంత ఇవ్వలేదని అడ్డం తిరిగాడు. ఇల్లు కట్టుకోకుండా చేస్తున్నాడు.’

- పాల్వంచకు చెందిన ఉద్యోగి ఆవేదన

* ‘పాల్వంచ వనమా కాలనీలో నాకు ఐదెకరాల భూమి ఉంది. రాజకీయంగా పలుకుబడి ఉన్న ఓ నాయకుడి కన్నుపడింది. ఎమ్మెల్యే తనయుడు అండగా నిలిచాడు. ఇద్దరూ కలిసి మాపై కేసు పెట్టించారు. మా భూమి న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. చేతుల దాటిపోతున్న ఆస్తి విలువ రూ.5 కోట్లు.’

-బాధిత యజమాని నిర్వేదం

* ‘కాంట్రాక్టు కాలనీలో మాకున్న 3 ఎకరాల భూమిని బలవంతంగా ఆక్రమించాడు. నకిలీ పత్రాలు సృష్టించాడు. అధికారుల అండతో స్థలం స్వాధీనం చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా 300 గజాల్లో ఉన్న ఇంటిని సైతం కూల్చివేయించాడు.’

- పాల్వంచ కాంట్రాక్టు కాలనీకి చెందిన బాధితుడు

* ‘కాంట్రాక్టర్స్‌ కాలనీ చెరువుకు సమీపంలో నిలువనీడ లేని నేను షెడ్డు వేసుకున్నా. కొంతకాలం తర్వాత అధికారులను పంపి షెడ్డు కూల్చివేయించాడు. 400 చదరపు గజాల స్థలానికి తప్పడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి హస్తగతం చేసుకున్నాడు. మేం కట్టుబట్టలతో రోడ్డునపడ్డాం.’

- మరో నిర్వాసితుడు

పార్టీలోనూ వన్​మెన్​గా..

2014లో కొత్తగూడెంలో వైకాపా నుంచి పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు ఓటమి పాలయ్యారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందారు. తర్వాత అధికార తెరాసలో చేరారు. తండ్రితోపాటు రాఘవ కూడా తెరాస తీర్థం పుచ్చుకున్నారు. అధికార పార్టీలో చేరిన తర్వాత అతను అన్నింట్లో వేలుపెడుతుండటంతో ఆగడాలు పెచ్చుమీరాయి. రాజకీయ జోక్యం మితిమీరింది. అధికారులు, ప్రజాప్రతినిధులు, నేతలు.. ఎవరైనా సరే చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. ఈ క్రమంలో ఇష్టారాజ్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ వ్యవహారాలే కాదు.. పార్టీలోనూ రాఘవేంద్ర వన్‌మెన్‌గా వ్యవహరించారు. తండ్రి అనారోగ్యం నేపథ్యంలో గడిచిన రెండేళ్లుగా ఈ ధోరణి శృతి మించటంతో కొందరు సొంతపార్టీ నేతలే ఒకవర్గంగా విడిపోయి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలనుకోగా తాజా పరిణామాలు వనమా కుటుంబానికి భారీ షాక్‌ ఇస్తున్నాయి. కుమారుణ్ని నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉంచుతానని ఎమ్మెల్యే ప్రకటించాల్సిన పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

పాల్వంచ సబ్‌డివిజనల్‌ పోలీసు కార్యాలయం వద్ద హడావుడి

చర్యలు తీసుకోవాలని డిమాండ్లు

వనమా రాఘవ బెదిరింపులతో కుటుంబాన్ని కడతేర్చి తానూ ప్రాణాలు విడిచిన పాత పాల్వంచ వాసి నాగరామకృష్ణ ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ఎమ్మెల్యే తనయుడిని ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో మాత్రం బాధితులు ఆయన ‘భూదందాలు.. కాసుల పందేరాల’ గురించి కథలుగా చెప్పుకొంటున్నారు. తన దృష్టికి ఏ సమస్య వచ్చినా తనకనుకూలంగా మార్చుకుని స్వలాభం పొందిన తీరును ఎండగడుతున్నారు. ‘మా మామ నుంచి వారసత్వంగా వచ్చిన 3 ఎకరాల భూమిని రాఘవ బలవంతంగా లాక్కున్నాడు. అడిగితే అనుచర రౌడీలతో మా ఆయన్ను కొట్టించాడు. తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయించాడు. ఇంటికెళ్లి బతిమిలాడితే అది నా భూమి! అడ్డొస్తే బొందపెడతానని బెదిరించాడు!! వ్యవస్థలూ ఆయనకే వంతపాడాయి. చిన్న పిల్లలున్న మా ఇంటినీ దుర్మార్గంగా కూల్చివేయించాడు. కూలీ చేసుకునేటోళ్లం. న్యాయం కోసం ఎదురెళ్తే చావే గతని తెలిసి మిన్నకున్న’ట్టు పాల్వంచకు చెందిన ఓ మహిళ విలేకరుల ఎదుట వాపోయింది. ఈ ఒక్కటి చాలు..! తన రాజకీయ బలంతో సదరు నాయకుడు ఎలాంటి దురాగతాలకు పాల్పడ్డాడో అర్థం చేసుకోవడానికి. చట్టపరంగా చర్యలు తీసుకున్నప్పుడే తమ కుటుంబాలకు సాంత్వన చేకూరుతుందని పలు బాధిత కుటుంబాల వ్యాఖ్యానించారు.

ర్యాలీలో పాల్గొన్న కూనంనేని, అఖిలపక్ష నాయకులు

నాటకీయ పరిణామాల నడుమ చిక్కాడు..

పోలీసులకు చిక్కిన రాఘవ

శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో రాఘవను పాల్వంచ ఏఎస్పీ కార్యాలయానికి తీసుకువచ్చిన పోలీసులు

అయిదు రోజుల తర్వాత చిక్కి...

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రామకృష్ణ కుటుంబ ఆత్మహత్య ఘటనలో ఏ-2గా ఉన్న వనమా రాఘవేందర్‌రావు నాటకీయ పరిణామాల నడుమ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గత అయిదు రోజులుగా తొర్రూరు, హైదరాబాద్‌, సూర్యాపేట, చీరాల, విశాఖపట్నం, రాజమండ్రికి ప్రయాణాలు సాగించాడు. ఒక్కోచోట ఒక్కో సిమ్‌కార్డును మార్చుతూ సాంకేతికంగా ఎక్కడా పోలీసులకు పట్టుబడకుండా జాగ్రత్త పడ్డాడు. విశాఖపట్నంలో రెండు రోజులపాటు తలదాచుకున్న రాఘవ శుక్రవారం విశాఖ నుంచి రాజమండ్రి మీదుగా హైదరాబాద్‌ వెళ్తుండగా పశ్చిమ గోదావరి, భద్రాద్రి జిల్లా సరిహద్దుల్లోని దమ్మపేట మండలం మందలపల్లి అడ్డరోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి జిల్లా పోలీసుల బృందం రాఘవను అదుపులోకి తీసుకుని నేరుగా పాల్వంచ ఏఎస్పీ కార్యాలయానికి తరలించారు. రాఘవతో పాటు పాల్వంచ మండలానికి చెందిన ముక్తేవి గిరీశ్‌, మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ శుక్రవారం రాత్రి ధ్రువీకరించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో రాఘవేందర్‌రావును భారీ పోలీస్‌ బందోబస్తు నడుమ పాల్వంచ పోలీస్‌ స్టేషన్‌కి తీసుకొచ్చారు. ఠాణా దరిదాపుల్లో కట్టుదిట్టమైన భద్రత చేపట్టారు. సబ్‌డివిజన్‌ కార్యాలయంలో ఏఎస్పీ రోహిత్‌రాజ్‌ సుదీర్ఘంగా విచారించారు.

రాఘవను స్టేషన్ కి తీసుకొచ్చిన కారు..

శుక్రవారం అర్థరాత్రి సమయంలో రాఘవను స్టేషన్ కి తీసుకొచ్చిన కారు..

రామకృష్ణ కుటుంబానికి శాంతి చేకూరాలని కోరుతూ ఖమ్మంలో కాంగ్రెస్‌ నాయకులు శుక్రవారం రాత్రి నల్లరిబ్బన్లు ధరించి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆందోళనలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు..

ఇదీ చదవండి: Palvancha Family suicide : రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.