ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. శ్రీశైలం యాత్ర ముగించుకుని నెల్లూరు వెళ్తున్న యాత్రికుల టెంపో... బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద ఆగిఉన్న లారీని ఢీకొట్టింది.
వాహనంలో మొత్తం 14 మంది యాత్రికులుండగా... ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. మిగిలిన వారికి గాయాలు కాగా... క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించారు. మృతులు తమిళనాడులోని చెన్నైవాసులుగా పోలీసులు గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమైన ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.