A young man committed suicide in Hanuma konda district: పోలీస్ ఉద్యోగం రాలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికొస్తే పోలీస్ ఉద్యోగంతోనే వస్తానని తల్లిదండ్రులకు చెప్పి.. చివరకు విగత జీవిగా మారిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. బందువుల కథనం ప్రకారం... హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రామానికి చెందిన జక్కుల రాజ్‌కుమార్ కొన్ని సంవత్సరాలగా పోలీస్ ఉద్యోగం కోసం సన్నద్ధం అవుతున్నాడు. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాశాడు.
అందులో 3 మార్కులు తక్కువ రావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో యువకుడు మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ఒడికట్టాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు... వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈరోజు చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. ఎదిగిన కొడుకు కళ్లముందే విగత జీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల బాధకు హద్దు లేకుండా పోయింది.
ఇవీ చదవండి: