ETV Bharat / crime

పిల్లలకు ఈత నేర్పిస్తానంటూ దగ్గరై వివాహితపై అత్యాచారం

Rape on Women అవసరాన్ని ఆసరాగా తీసుకున్నాడు. అదే అదునుగా సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఇంకేముంది మనోడి నిజస్వరూపాన్ని చూపించాడు. బ్లాక్​మెయిల్​ చేస్తూ వివాహితపై పలుమార్లు దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా బోడుప్పల్​లో చోటు చేసుకుంది.

women raped
వివాహితపై అత్యాచారం
author img

By

Published : Aug 28, 2022, 10:06 AM IST

Rape on Women తన పిల్లలకు ఈత నేర్పించాలంటూ తీసుకొచ్చిన మహిళతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిపై అత్యాచారం కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్‌కు చెందిన వివాహితకు ఇద్దరు పిల్లలు. వారికి ఈత నేర్పించాలని పల్లవి మోడల్‌ స్కూల్‌లోని స్విమ్మింగ్‌ కోచ్‌గా పనిచేస్తున్న బోడుప్పల్‌ సిద్ధివినాయక కాలనీకి చెందిన సుజిత్‌(23)ను సంప్రదించారు.

పిల్లలకు ఈత నేర్పించే క్రమంలో అతను మహిళతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఆమె తన వ్యక్తిగత సమస్యల్ని చెప్పారు. ఇదే అదనుగా అనుమతి లేకుండా వ్యక్తిగత ఫొటోలు తీసుకున్నాడు. ఆ ఫొటోలు చూపించి తనతో గడపాలంటూ బెదిరించాడు. అంగీకరించకపోవడంతో దాడికి దిగాడు. బాధితురాలి భర్త లేని సమయం చూసి నేరుగా ఇంటికెళ్లి దాడి చేసి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత పలుమార్లు ఆమెపై అదే తరహాలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫొటోల్ని భర్తకు పంపిస్తానంటూ రూ.లక్ష తీసుకున్నాడు. వేధింపులు భరించలేకపోయిన బాధితురాలు షీటీమ్స్‌ ద్వారా మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు ప్రస్తుతం రిమాండులో ఉన్నాడు.

ఇవీ చదవండి: చోరి చేసిన ఇంటిని తగలబెట్టిన దొంగలు, ఎందుకంటే

ఆశా కార్యకర్తపై గ్యాంగ్ రేప్, కిడ్నాప్ చేసి, ఆపై దారుణంగా హింసించి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.