ETV Bharat / crime

Tragedy: ఇద్దరు పిల్లలతో కలిసి రైలుకింద పడిన తల్లి

mother
విషాదం
author img

By

Published : Jul 11, 2021, 4:48 PM IST

Updated : Jul 11, 2021, 9:23 PM IST

16:45 July 11

పెద్దపల్లి జిల్లాలో విషాదం

నిత్యం భర్తతో వేధింపులు. ఇంట్లో ప్రశాంతత లేదు. తరచూ గొడవలు. భర్త ప్రవర్తనతో విసిగి వేసారిపోయిన ఓ మహిళ తాను చనిపోవడమే మేలని భావించింది. తాను చనిపోతే పిల్లల పరిస్థితి ఏంటని అని ఆలోచించిందేమో వాళ్లని కూడా తనతో పాటే తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. రైలు కిందపడి ప్రాణాలు తీసుకోవాలని ఆత్మహత్యకు ఒడిగట్టింది. ఘటనాస్థలంలోనే ఆమె మృతి చెందగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మూడేళ్ల ఏళ్ల కూతురు ప్రాణాలొదిలింది. కుమారుడు మృత్యువుతో పోరాటం చేస్తున్నాడు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యైటింక్లైయిన్ కాలనీకి చెందిన ప్రవీణ్, అరుణ దంపతులకు ఎనిమిది సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కూతురు సాత్విక(3), కుమారుడు సాత్విక్ (6) ఉన్నారు.  

ప్రవీణ్ నిత్యం మద్యం సేవిస్తూ తరుచు భార్యతో గొడవకు దిగేవాడు. భర్త వేధింపులు భరించలేక అరుణ ఇవాళ రామగుండం రైల్వేస్టేషన్ సమీపంలో దానాగిరి ఎక్స్‌ప్రెస్‌ కింద తన ఇద్దరు చిన్నారులతో కలిసి దూకింది. ఘటనా స్థలంలో అరుణా మృతిచెందగా... చిన్నారి సాత్వికా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలింది.

 తీవ్ర గాయాలపాలైన సాత్విక్​ను మెరుగైన వైద్యం కోసం కరీంనగర్​కు తరలించారు. తల్లి, చిన్నారి కూతురు మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువుల ఆర్తనాదాలతో ఆస్పత్రి దద్దరిల్లింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదీ చదవండి: KTR TWEET: తెలంగాణలో గ్రీన్​ మిషన్​... అద్భుత దృశ్యాలను పంచుకున్న కేటీఆర్​

Last Updated : Jul 11, 2021, 9:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.