వరంగల్ పట్టణంలో కరోనా నివారణకు అధికారులు ఎంతటి చర్యలు తీసుకుంటున్నా.. కొంతమంది మాత్రం బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించాలని చెప్పినప్పటికీ అధికారుల మాట పెడచెవిన పెట్టి వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. రకరకాల కారణాలు చెప్తూ రోడ్ల మీద తిరిగుతూ.. వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. కూరగాయలు, మాంసం, పళ్ల దుకాణాల వద్ద కనీస జాగ్రత్తలు పాటించకుండా తోటి వారి ప్రాణాలతో కూడా చెలగాటమాడుతున్నారు. మాస్కు లేకుండా బయట కనిపిస్తే.. అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకొని శిక్షించాలని పలువురు కోరుతున్నారు.
ఇదీ చూడండి: దీర్ఘకాలంలోనూ కరోనా వైరస్ ప్రభావం?