కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని కొండాపూర్ గుడితండాలో చిరుత కలకలం సృష్టించింది. మంగళవారం తండా సర్పంచ్ దేవిదాస్కు చెందిన ఆవుపై దాడి చేసి చంపింది. సర్పంచ్ తెలిపిన వివరాల ప్రకారం ప్రతి రోజు మాదిరిగానే సర్పంచ్ తల్లి.. ఆవును పశుగ్రాసం కోసం అడవిలోకి తీసుకెళ్లింది. ఓ చోట కట్టేసి తన పనిలో నిమగ్నమైంది. అడవిలోంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన చిరుత ఆవు గొంతు పట్టుకుని దాడి చేసింది.
అక్కడే ఉన్న గొర్రెల కాపరులు కేకలు వేయగా ఆవును గుట్టపక్కకు లాక్కెళ్లి ఆవును చంపేసింది. గత నెలలో కూడా చిరుత ఓ దూడపై దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. చిరుత దాడితో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. చిరుత సంచారంతో ఆ ప్రాంత వాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుత నుంచి కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: భయం భయం: హడలెత్తిస్తున్న చిరుతల సంచారం