ETV Bharat / city

పైసా వసూల్: మొక్కు చెల్లించాలంటే.. డబ్బులు ఇవ్వాల్సిందే - బడాపహాడ్​ దర్గాలో వసూళ్ల దందా

పుణ్యక్షేత్రాలకు వెళ్లినవారు దైవదర్శనం చేసుకుని.. మానసిక ప్రశాంతత పొందుతారు. అక్కడ మాత్రం డబ్బులు ఉంటేనే దేవుణ్ని చూడగలుగుతారు. లేదంటే చీత్కారాలు, చీదరింపులే మిగులుతాయి. ఏళ్లు గడుస్తున్నా... ఆ పుణ్యక్షేత్రంలో వసూళ్ల దందా మాత్రం ఆగడం లేదు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు.. పరిస్థితులు చూసి అసహనానికి గురవుతున్నారు.

high collections for god visit at badapahad darga in jalalapur
పైసా వసూల్: మొక్కు చెల్లించాలంటే.. డబ్బులు ఇవ్వాల్సిందే
author img

By

Published : Feb 23, 2021, 6:03 PM IST

పైసా వసూల్: మొక్కు చెల్లించాలంటే.. డబ్బులు ఇవ్వాల్సిందే

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్‌పూర్‌లోని బడాపహడ్‌ దర్గాకు... మతాలతో సంబంధం లేకుండా అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక్కడ జరుగుతున్న ఉర్సు ఉత్సవాలకు రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఏటా ఈ ఆలయానికి దాదాపు రూ.3 కోట్లకు పైగా ఆదాయం వస్తుండగా... నిర్వహణను టెండరు కింద ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తారు. ఈ ఏడాది మూడున్నర కోట్లు పాడిన ఓ వ్యక్తి... వాటిని రాబట్టుకునేందుకు బలవంతంగా వసూళ్లకు దిగుతున్నారు. గుట్ట కింది నుంచి పైవరకు అడుగడుగునా వసూళ్లకు పాల్పడుతున్నారు. మేక కందూర్, చాదర్ సమర్పణ, దర్శనం, కొబ్బరికాయలు కొట్టడం, ప్రసాదం సమర్పణ, మొక్కుల చెల్లించేందుకు డబ్బులు ఇస్తేనే పని జరుగుతోంది.

డబ్బులిస్తేనే దర్శనం

ఎక్కడైనా గుడికి వెళ్లిన భక్తులు దైవదర్శనం తర్వాత హుండీలో తోచినంత కానుకలు వేస్తుంటారు. పెద్దగుట్టలో మాత్రం ముందు డబ్బులు ఇస్తేనే దైవ దర్శనం జరుగుతుంది. దర్గాలోకి వెళ్లగానే హుండీ వద్ద గుత్తేదారు మనుషులుంటారు. ఆ హుండీకి మూడు పక్కలా నిలబడి భక్తుల నుంచి డబ్బులు అడుగుతారు. పేర్లు రాసి డబ్బులు హుండీలో వేయకుండా డబ్బాల్లో వేసుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.

ఈటీవీ బృందం దర్గా వద్ద ఉండగానే పలువురు భక్తులు ముజావర్లతో గొడవకు దిగారు. ఓ భక్తుడు తన వద్ద రూ. 6 ఉన్నాయంటే... వెనక్కి పంపించాడు. మరో భక్తుడు రూ. 600 ఇస్తే అతన్ని లోపలికి పంపించారు. నిర్వహకులను ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. పెద్దగుట్టలో వసూళ్ల బాధలు భరించలేక చాలా మంది భక్తులు... బడాపహాడ్ పరిసర ప్రాంతాల్లో ఆగి కందూర్ చేసుకొని గుట్టవద్దకు వచ్చి సమర్పించి వెళ్లిపోతున్నారు. మరికొందరు సమీపంలోని జకోరా చిన్న దర్గా వద్ద మేకను బలిచ్చి పరిసరాల్లో నైవేద్యం చేసుకుంటున్నారు.

ఇదీ చూడండి: పెచ్చులూడిన అసెంబ్లీ పాత భవనం మొదటి అంతస్తు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.