అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశారని, ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (ysrtp president ys sharmila) వ్యాఖ్యానించారు. తెరాస ఏడేళ్ల పాలనలో గొప్పలు చెప్పుకోవడం మినహా చేసిందేమీ లేదని విమర్శించారు. నల్గొండ జిల్లాలో పాదయాత్ర (praja prasthanam) నిర్వహిస్తున్న ఆమె... ప్రజలతో ముచ్చటించారు.
ప్రజాప్రస్థానం పాదయాత్రలో (praja prasthanam) భాగంగా షర్మిల... నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని పలు పల్లెల్లో (ysrtp president ys sharmila padayatra) ప్రజల్ని కలుసుకున్నారు. కుర్మేడ్, సమాఖ్యనగర్, కుర్మపల్లి, సాయిరెడ్డిగూడెం, పి.కె.మల్లేపల్లిలో స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం పి.కె.మల్లేపల్లిలో మాట-ముచ్చట కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసేవరకు తమ పోరాటం ఆగదని... షర్మిల స్పష్టం చేశారు. కేసీఆర్ పాలన తీరుపై మరోసారి ఆమె విమర్శలు చేశారు. రెండు పడక గదుల ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మాట ఇచ్చి... ఆయా వర్గాల్ని మోసం చేశారన్నారు. పత్తి పంటకు సంబంధించి మోన్ శాంటో విషయంలో... వైఎస్ హయాంలో న్యాయపోరాటం వల్ల విత్తనాల ధరలు తగ్గి రైతులకు మేలు జరిగిందని షర్మిల గుర్తు చేసుకున్నారు.
రుణమాఫీ అందడం లేదని కొందరు... ఊళ్లో పనిలేక వలస పోతున్నామని (ysrtp president ys sharmila padayatra) మరికొందరు... పంటలకు ధర ఉన్నా దిగుబడులు లేక పెట్టుబడులతో అప్పుల పాలయ్యామని మరికొందరు షర్మిలతో ఆవేదన వ్యక్తం చేశారు.
-
నా ప్రతి అడుగు ప్రజల కోసమే.. పేదల కన్నీటి చుక్కలు ఆగి, అభివృద్ధి వైపు పరుగులు పెట్టినప్పుడే నా ఆశయం సిద్ధిస్తుంది. ఆ సదాశయం కోసం అనుక్షణం పోరాడుతా.. గమ్యం చేరేంత వరకు ప్రజల కోసం, ప్రజల తరఫున పయనిస్తా.
— YS Sharmila (@realyssharmila) November 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
‘జై తెలంగాణ..జోహార్ వైయస్ఆర్’#PrajaPrasthanam#Day15#YSRTP pic.twitter.com/vMqI3Pz2li
">నా ప్రతి అడుగు ప్రజల కోసమే.. పేదల కన్నీటి చుక్కలు ఆగి, అభివృద్ధి వైపు పరుగులు పెట్టినప్పుడే నా ఆశయం సిద్ధిస్తుంది. ఆ సదాశయం కోసం అనుక్షణం పోరాడుతా.. గమ్యం చేరేంత వరకు ప్రజల కోసం, ప్రజల తరఫున పయనిస్తా.
— YS Sharmila (@realyssharmila) November 3, 2021
‘జై తెలంగాణ..జోహార్ వైయస్ఆర్’#PrajaPrasthanam#Day15#YSRTP pic.twitter.com/vMqI3Pz2liనా ప్రతి అడుగు ప్రజల కోసమే.. పేదల కన్నీటి చుక్కలు ఆగి, అభివృద్ధి వైపు పరుగులు పెట్టినప్పుడే నా ఆశయం సిద్ధిస్తుంది. ఆ సదాశయం కోసం అనుక్షణం పోరాడుతా.. గమ్యం చేరేంత వరకు ప్రజల కోసం, ప్రజల తరఫున పయనిస్తా.
— YS Sharmila (@realyssharmila) November 3, 2021
‘జై తెలంగాణ..జోహార్ వైయస్ఆర్’#PrajaPrasthanam#Day15#YSRTP pic.twitter.com/vMqI3Pz2li
ఇదీచూడండి: Manchirevula farm house case: ప్రముఖుల మెప్పు కోసం నోరూరించే వంటకాలు.. సకల సౌకర్యాలు..