యాదగిరిగుట్ట పట్టణంలోని పలు కాలనీల్లో ఆస్తుల వివరాల సేకరణ కోసం జరుగుతున్న సర్వేను అదనపు కలెక్టర్ ఖిమ్యానాయక్ పరిశీలించారు. వ్యవసాయేతర ఆస్తుల వివరాలను సేకరించి ధరణి సైట్లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో.. సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నారు. ఇంటి పన్ను, నీటి పన్ను, కరెంటు బిల్లు, ఇంటి యజమాని ఫోటో, గుర్తింపు కార్డు, ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలు, పాస్బుక్ నెంబర్ తదితర వివరాలను సేకరిస్తున్నారు.
ఉదయం 6 గంటల నుంచే సర్వేను ప్రారంభించాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. సర్వే పారదర్శకంగా సాగాలని, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.
ఇవీ చూడండి: అధికారులు కావలెను: ఇన్ఛార్జీల పెత్తనం.. పరిపాలనపై ప్రభావం