ETV Bharat / city

సాంకేతికతతో అధిగ దిగుబడులు : శ్రీనివాస్ గౌడ్ - Paddy Plantation Machine usage in telangana cultivation

వ్యవసాయ రంగంలో సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకుని రైతులు అధిక దిగుబడి సాధించాలని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్​నగర్​ గ్రామీణ మండల పరిధిలోని కోటకదిరలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వరి నాటు యంత్రాన్ని పరిశీలించారు.

-advanced-technology-in-cultivation
సాంకేతికతతో వ్యవసాయ రంగంలో అధిగ దిగుబడులు
author img

By

Published : Jan 19, 2021, 7:49 AM IST

కూలీల కొరతతో రైతులు వరినాట్లు వేసేందుకు ఇబ్బందులు పడుతున్నారని.. సాగులో ఆధునిక యంత్రాలు ఉపయోగిస్తే తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో నాటు వేయొచ్చని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్​నగర్​ గ్రామీణ మండల పరిధిలో పర్యటించిన ఆయన.. కోటకదిరలో వరినాటు యంత్రాన్ని పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా సాగు కోసం సబ్సిడీపై అధునాతన యంత్రాలు రైతులకు అందించే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

-advanced-technology-in-cultivation
నాటు వేద్దాం రండి!
-advanced-technology-in-cultivation
తక్కువ సమయంలో.. ఎక్కువ విస్త్రీర్ణంలో నాటు

వ్యవసాయ రంగంలో సాంకేతిక విజ్ఞానం ఉపయోగించడం వల్ల అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను రాష్ట్రంలో అమలు చేస్తామని, దీనిద్వారా రైతులు ఇతర రాష్ట్రాల్లోనూ తమ పంట అమ్ముకోవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న రైతు బంధు పథకం నిరంతరాయంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. యువత వ్యవసాయ రంగంవైపు ఆసక్తి చూపడం శుభపరిణామమని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

advanced-technology-in-cultivation
యంత్రంతో వరినాటు
-advanced-technology-in-cultivation
వరినాటు యంత్రంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.