కేంద్రం తెచ్చిన రైతు చట్టాల వల్ల కార్పొరేట్ శక్తులకు లాభం చేకూరుతుందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఖమ్మంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి ధర్నా చౌక్‌లో ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
"భాజపాపై దేశంలో వ్యతిరేకత ప్రారంభమైంది. ఇటీవల భాజపా పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపే అందుకు నిదర్శనం. కేసీఆర్ వ్యవసాయ చట్టాలపై యూటర్న్ ఎందుకు తీసుకున్నారో చెప్పాలి. శాసన సభలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బిల్ పాస్ చేయాలి. భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ భాష సరిగా లేదు. కోర్టులు చర్యలు తీసుకోవాలి."
-వి.హనుమంతరావు, మాజీ ఎంపీ
ఇదీ చూడండి: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ముగ్గురు అరెస్టు