ఖమ్మంలో ప్రజాస్వామ్యాన్ని.. తెరాస అపహాస్యం చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. గులాబీ పార్టీకి బుద్దిచెప్పాలంటే.. బల్దియా ఎన్నికల్లో వారిని ఓడించాలని నగర ప్రజలకు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పేరిట అవినీతి మయంగా మార్చారని విమర్శించారు.
ఖమ్మం ప్రతిష్ఠను మళ్లీ ఇనుమడింపజేసేందుకు.. కలిసిరావాలని కోరారు. అభివృద్ధి అంటే గత ప్రభుత్వాలు చేసిన వాటికి కొత్త రంగులు వేయడం కాదన్నారు భట్టి.