ETV Bharat / city

TRS Strategy in Huzurabad By Election 2021 : హుజూరాబాద్​లో తెరాస వ్యూహం ఫలించేనా? విజయం వరించేనా? - TRS strategy for Huzurabad by election

తన మంత్రి పదవికి ఈటల రాజీనామా చేయడంతో తెరపైకి వచ్చిన హుజూరాబాద్​ ఉపఎన్నిక.. అప్పటినుంచి రోజుకో మలుపు తీసుకుంటోంది. నెలల క్రితమే ప్రచారానికి నాంది పలికిన తెరాస, భాజపాలు విమర్శలు, ప్రతివిమర్శలతో ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇందులో అధికార తెరాస కాస్త వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మొదటి నుంచి పక్కా ప్రణాళిక(TRS Strategy in Huzurabad By Election 2021)తో పావులు కదుపుతోంది. పథకాలు, ప్రచారాల్లో జోరు చూపిస్తూ నియోజకవర్గ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తోంది. మరి తెరాస హుజూరాబాద్​ కోటపై మరోసారి గులాబీ జెండా ఎగురవేసేనా..?

TRS Strategy in Huzurabad By Election 2021

author img

By

Published : Oct 10, 2021, 2:23 PM IST

హుజూరాబాద్ ఓటర్ నాడీ తెలుసుకునేందుకు నిరంతర సర్వేలు కొనసాగుతున్నాయి. గ్రామాల వారీగా, వార్డుల వారీగా, ఓటర్ల వారీగా.. ఇలా ఏ ఒక్క అంశాన్ని వదలకుండా అన్ని కోణాల్లోనూ సర్వేలు జరుగుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో(TRS Strategy in Huzurabad By Election 2021) గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న అధికార తెరాస ప్రభావం ఎంత మేరకు పెరిగింది. ప్రత్యర్థి ఓటమి ఖాయం అయిందా లేదా అన్న అంశంపై అన్ని కోణాల్లో ఆరా తీయిస్తున్నారు. ఓ వైపున నిఘా వర్గాలు, మరో వైపున సర్వే ఏజెన్సీలు, మీడియా సంస్థలు ఇలా అవకాశం ఉన్న ప్రతి ఏజెన్సీతో గ్రౌండ్ రియాల్టీపై విశ్లేషిస్తున్నారు. మరో వైపు ఎక్కడెక్కడ లోపాలున్నాయో తెలుసుకుని దానికి అనుగుణంగా పావులు కదుపుతున్నారు.

ఓటర్లలో వస్తున్న మార్పు ఏమేర..

ఐదు నెలలుగా ప్రచారంతో పాటు పథకాలతో హుజూరాబాద్ ఓటర్ల(Huzurabad Voters)ను ఆకట్టుకునేందుకు తెరాస చేయని ప్రయత్నం లేదు. చేసిన యత్నాలు ఏమేర ఫలిస్తున్నాయి? ఇప్పటి వరకు ఎంత మేరకు ఓటర్ల(Huzurabad Voters)ను తమకు అనుకూలంగా మల్చుకోగలిగామన్న దానిపై తెరాస ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యర్థి ఈటల రాజేందర్ ప్రభావాన్ని తగ్గించడంలో ఎంతమేర విజయం సాధించామన్నదానిపై ఆరా తీస్తోంది. ఆధిక్యత కోసం ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలన్న విషయంపై బేరీజు వేసుకునే పనిలో పడింది. ఇంతకాలం సంక్షేమ పథకాలు, తాయిలాలు ప్రకటించగా, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వ్యక్తిగతంగా ఓటర్లను చేరుకునే విధంగా ప్రణాళిక రూపొందించుకుంటోంది. ఏది ఏమైనా హుజూరాబాద్‌లో గులాబీ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంగా సామదాన దండోపాయాలను అమలు చేస్తోంది.

నిరంతర సర్వేలపై సర్వేలు..

హుజూరాబాద్ ఎన్నికలు(TRS Strategy in Huzurabad By Election 2021) చాలా చిన్నవని సీఎం కేసీఆర్ అన్నా.. పెద్ద కర్రతోనే కొట్టే యత్నం చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియను స్వయంగా మంత్రులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నా పలు రకాలుగా సేకరించిన సర్వేలపై రీ సర్వేలు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా ప్రతి ఓటరును ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏంటీ అన్న విషయంపై ప్రధానంగా దృష్టి సారించారు. పోలింగ్ సమీపిస్తున్న కొద్ది వ్యూహాలు కూడా మరింత పదునెక్కుతున్నాయి. దుబ్బాక ఫలితం పునరావృతం కాకూడదని, హుజూరాబాద్‌లో పైచేయి తమదే కావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

నిరంతర నిఘా నీడలో నియోజకవర్గం

హుజూరాబాద్ నియోజకవర్గం(TRS Strategy in Huzurabad By Election 2021)లో ఇంటెలిజెన్స్ వర్గాలే కాకుండా ఇతరత్రా విభాగాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులను కూడా రంగంలోకి దింపినట్లు సమాచారం. వీళ్లంతా ప్రజలతో మమేకమై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈటలపై ప్రజలకు ఉన్న సానుకూలత ఏంటీ, తెరాసపై ఉన్న వ్యతిరేకత ఏంటన్న విషయంపై లోతుగా ఆరా తీస్తూ నివేదికలు తెప్పించే ప్రక్రియ సాగుతోంది.

బరిలో నిలిచిన భాజపా, కాంగ్రెస్​లపై.. తెరపై విమర్శలు, ప్రతివిమర్శలు, మాటలతో దాడులు చేస్తూనే తెరవెనుక తమ వ్యూహాన్ని పక్కాగా అమలుచేస్తోంది తెరాస. ఎలాగైన హుజూరాబాద్​ గద్దెపై గులాబీ జెండా ఎగురుతుందన్న ధీమాతో.. ప్రచారంలో దూసుకెళ్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.