ETV Bharat / city

Etela: ఈటల ర్యాలీలో డీజే బంద్.. పోలీసుల తీరుపై అనుచరులు సీరియస్ - Karimnagar district news

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్బాపూర్​లో మాజీ మంత్రి ఈటల పర్యటనలో కాస్త ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీలో ఏర్పాటుచేసిన డీజే ఫ్యూజ్​లను స్థానిక ఎస్​ఐ తొలగించారు. ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల వర్గీయులు ఎస్​ఐ వాహనాన్ని చుట్టుముట్టారు.

ETELA RAJENDER
etela
author img

By

Published : Jun 22, 2021, 6:04 PM IST

మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ ర్యాలీ సందర్భంగా పోలీసులు, ఆయన వర్గీయులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎస్‌ఐ వాహనాన్ని చుట్టుముట్టి ఈటల వర్గీయులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్బాపూర్​లో ఈ వివాదం చోటు చేసుకొంది.

ఈటల ర్యాలీగా వెళ్తున్న క్రమంలో అక్కడకు చేరుకున్న ఎస్‌ఐ కిరణ్​రెడ్డి.. డీజేకు అనుమతి లేదంటూ ఫ్యూజ్​లను తొలగించారు. దీంతో ఈటల అనుచరులు ఎస్‌ఐతో వాగ్వాదానికి దిగారు. ఆందోళనను పట్టించుకోని ఎస్సై తన వాహనం ఎక్కి కూర్చొన్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల అనుచరులు.. ఎస్​ఐ వాహనాన్ని చుట్టుముట్టి ఆందోళన చేశారు. కొంత మంది జోక్యం చేసుకొని ఎస్​ఐతో మాట్లాడి.. డీజేకు సంబంధించిన ప్యూజ్​లను ఇప్పించారు. దీంతో గొడవ సద్దుమణిగింది.

ఈ క్రమంలో అక్కడకొచ్చిన ఏసీపీ విజయ్​కుమార్.. కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో డీజేకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తేల్చిచెప్పారు. కరీంనగర్ సీపీగా కమలాసన్​రెడ్డి ఉన్నంత కాలం... డీజేలకు అనుమతించేది లేదని ఏసీసీ స్పష్టం చేశారు.

ఈటల ర్యాలీలో డీజే ఫ్యూజ్​లను తొలగించిన పోలీసులు

ఇదీచూడండి: MINISTER PRASHANTH REDDY: 'తండ్రి నీటి దొంగైతే... కొడుకు గజదొంగ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.