రెండో విడతలో జరిగిన కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇవాళ జరగనుంది. మొత్తం 3 రౌండ్ల ఓట్ల లెక్కింపునకు సంబంధించి 58 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 58 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు, ఒకరికి ఇద్దరు అసిస్టెంట్లు, 20 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. మొత్తం 650 మంది సిబ్బందిని లెక్కింపు కోసం ఉపయోగిస్తున్నారు. మొదట డివిజన్‌ల వారిగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నగర పాలక సంస్థ పరిధిలోని 58 డివిజన్లలో... 366 అభ్యర్థులు బరిలో ఉన్నారు. భద్రత దృష్ట్యా కౌంటింగ్ వద్ద అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: రాజ్భవన్లో ఎట్హోం... సీఎం సహా ప్రముఖుల హాజరు