కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని మిషన్ భగీరథ పరికరాలు ఉంచిన గదిలో గురువారం అర్ధరాత్రి 1.45 ని.లకు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
మిషన్ భగీరథ పరికరాలు మంటలకు ఆహుతైనట్లు స్థానికులు తెలిపారు. షార్ట్‌సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లుగా అగ్నిమాపక అధికారులు అంచనా వేస్తున్నారు. రూ.2 కోట్ల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు ప్రాజెక్టు బాధ్యులు గోపాల్‌రెడ్డి భావిస్తున్నారు.
ఇవీ చూడండి: పతంగి ఎగురవేస్తుండగా.. చిన్నారికి కరెంటు షాక్