ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా రాయదుర్గం పురపాలికలో తెదేపాకు చెందిన ముగ్గురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ విషయంపై ప్రశ్నిచేందుకు కాలవ శ్రీనివాసులు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లగా.. ప్రభుత్వ విప్ కాపు రామమచంద్రా రెడ్డి కూడా తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రెచ్చిపోయిన వైకాపా కార్యకర్తలు కాలవతో పాటు మున్సిపల్ కమిషనర్‌పైనా దాడికి యత్నించారు.
తక్షణమే పోలీసులు అక్కడికి చేరుకుని కాలవను అక్కడి నుంచి తరలించారు. కళ్యాణదుర్గం తరలించే ప్రయత్నాలను తెదేపా శ్రేణులు ప్రతిఘటించగా ఇంటి వద్ద విడిచిపెట్టారు. కాపురామచంద్రారెడ్డి వీధి రౌడీలాగా వ్యవహరించారని కాలవ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో తమను హతమార్చడానికి వైకాపా నేతలకు ప్రత్యేక హక్కులు ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్.. అప్రమత్తమైన ప్రభుత్వం