ETV Bharat / city

కోఠిలో మహిళ హల్​చల్​.. నా కారుకే చలానా వేస్తావా అంటూ ఫైర్​..! - ట్రాఫిక్ పోలీసులతో మహిళ వాగ్వాదం

Women Halchal in Koti: కోఠిలోని సుల్తాన్‌బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ మహిళ హంగామా సృష్టించింది. ట్రాఫిక్‌ పోలీస్‌ వద్ద వాకీ టాకీ లాక్కొని వాగ్వాదానికి దిగింది. పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. కారును సీజ్​ చేశారు.

Women Halchal
Women Halchal
author img

By

Published : Sep 21, 2022, 5:21 PM IST

Women Halchal in Koti: హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ హల్ చల్ చేసింది. కోఠి బ్యాంక్ స్ట్రీట్​లో "నో" పార్కింగ్ స్థలంలో కారు పార్క్ చేసిన దివ్య అనే మహిళను అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ప్రశ్నించారు. "నో" పార్కింగ్ స్థలంలో కారు పార్కింగ్ చేయడంతో... కార్ వీల్​కు లాక్ వేసిన ట్రాఫిక్ పోలీసులు చలానా వేశారు.

దీన్ని గమనించిన మహిళ తన కారుకు ఎలా చలాన్ విధిస్తారంటూ ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో ఓ ట్రాఫిక్ పోలీస్ వద్ద ఉన్న వాకీటాకీని లాక్కొన్న దివ్య... పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది. ఇప్పుడు ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్​చల్ చేస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దివ్యపై కేసు నమోదు చేసిన సుల్తాన్ బజార్ పోలీసులు... కారును సీజ్ చేశారు.

కోఠిలో ఓ మహిళ హల్​చల్​.. నా కారుకే చలానా వేస్తావా అంటూ ఫైర్​..!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.