హైదరాబాద్ వనస్థలిపురం బీఎన్‌రెడ్డి నగర్లో నవంబర్ 26న విద్యుదాఘాతంతో గుడిసెతో సహా వ్యక్తి సజీవదహనం అయ్యాడు. అయితే అది హత్యగా పోలీసులు ధ్రువీకరించారు. ప్రియుడితో కలిసి భర్తను భార్యే కడతేర్చింది. వివరాల్లోకి వెళితే... రమేశ్, స్వప్న భార్యభర్తలు. స్వప్నకు ఆరు నెలలుగా వెంకటయ్యతో సాన్నిహిత్యం పెరిగింది. దీనికి భర్త అడ్డుగా ఉన్నాడని, అతడిని అడ్డు తొలగించుకోవాలని స్వప్న భావించింది. భర్తను చంపేయాలని రమేశ్‌తో కలిసి పధకం రచించింది. ముందస్తు ప్రణాళికలో భాగంగా సొంతూరు సూర్యాపేటకు వెళ్లింది. వెంకటయ్య గత నెల 26 తేదీ అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో గుడిసెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో రమేశ్ సైతం ఆ మంటల్లో సజీవ దహనం అయ్యాడు. నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
పూర్తి సమాచారం ఇక్కడ క్లిక్ చేయండి: ప్రియుడి మాయలో పడి భర్తను కడతేర్చెరో రాములా...