ఆగ్నేయ భారతం నుంచి తెలంగాణ వైపు గాలులు వస్తున్నందున మంగళవారం నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పగలు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. ఆదివారం రాత్రి అత్యల్పంగా సిర్పూర్(కుమురం భీం జిల్లా)లో 12.9, పిట్లం(కామారెడ్డి)లో 13.5, బజార్ హత్నూర(ఆదిలాబాద్)లో 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఉదయం పూట కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోంది. నాగాలాండ్ నుంచి తెలంగాణ మీదుగా లక్షదీవుల వరకూ ఉన్న ఉపరితల ద్రోణి, బంగాళాఖాతంలోని మరో ద్రోణి బలహీనపడ్డాయి.
ఇదీ చదవండి: నేటి నుంచి మొదటి విడత జేఈఈ-మెయిన్