ETV Bharat / city

హైదరాబాద్‌లో లక్ష రెండు పడక గదుల ఇళ్లను సిద్ధం చేస్తున్నాం: కేటీఆర్ - hyderabad latest news

హైదరాబాద్‌లో లక్ష రెండు పడక గదుల ఇళ్లను సిద్ధం చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం కట్టించి ఇస్తున్న ఒక్కో ఇంటి విలువ రూ.40-50 లక్షల వరకు ఉంటుందన్నారు. అందరూ ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతోనే మంచి ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని పేర్కొన్నారు.

ktr on opposition
హైదరాబాద్‌లో లక్ష రెండు పడక గదుల ఇళ్లను సిద్ధం చేస్తున్నాం: కేటీఆర్
author img

By

Published : Oct 26, 2020, 12:22 PM IST

Updated : Oct 26, 2020, 1:32 PM IST

విజయదశమి కానుకగా ప్రభుత్వం.. పేదల సొంతింటి కలను సాకారం చేసింది. హైదరాబాద్‌లో మూడు చోట్ల రెండు పడకల గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందించింది. జియాగూడ నిర్మించిన ఇళ్లను.. మంత్రులు మహమూద్​ అలీ, తలసాని శ్రీనివాస్​యాదవ్​, మేయర్​ బొంతు రామ్మోహన్​తో కలిసి.. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

పండుగ వాతావరణంలో గృహప్రవేశాలు నిర్వహించుకున్నామని కేటీఆర్ తెలిపారు. 75 ఏళ్లలో తొలిసారి ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లి నేనే చేస్తానంటున్న ఏకైక సీఎం కేసీఆరేనని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో లక్ష రెండు పడక గదుల ఇళ్లను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. నగరంలోని నిరుపేదలకు దశలవారీగా ఇళ్లను కేటాయిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

గతంలో అగ్గిపెట్టె, డబ్బాల్లాంటి ఇళ్లు ఇచ్చేవారని కేటీఆర్ విమర్శించారు. గత ప్రభుత్వాల హయాంలో కట్టిందే డబ్బా ఇళ్లు.. వాటిలో కూడా అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇళ్లు కట్టకుండానే కట్టినట్లు చూపించి డబ్బు దండుకున్నారని మంత్రి కేటీఆర్​ మండిపడ్డారు.

కేసీఆర్​ ప్రభుత్వంలో పైసా చెల్లించే అవసరం లేకుండానే పేదలకు ఇళ్లు కేటాయిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం కట్టించి ఇస్తున్న ఒక్కో ఇంటి విలువ రూ.40-50 లక్షల వరకు ఉంటుందన్నారు. అందరూ ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతోనే మంచి ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని పేర్కొన్నారు.

ఇళ్ల కేటాయింపులో ఎవరికి డబ్బులు ఇవ్వొద్దని కేటీఆర్ సూచించారు. రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులో నాయకులు జోక్యం చేసుకోవద్దని హితవుపలికారు.

హైదరాబాద్‌లో లక్ష రెండు పడక గదుల ఇళ్లను సిద్ధం చేస్తున్నాం: కేటీఆర్

ఇవీచూడండి: జియాగూడలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించిన మంత్రులు

Last Updated : Oct 26, 2020, 1:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.