ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేదారిపురం గ్రామస్థులు... మహాత్మా గాంధీని దైవంగా భావించి పూజలు చేయడాన్ని ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. కొన్ని దశాబ్ధాలుగా.. గ్రామంలో ఈ సంప్రదాయం నడుస్తోంది. ఏటా ఖరీఫ్ పనుల ప్రారంభించే సందర్భంగా అంతా ఉపవాసాలు ఉంటూ గ్రామం మధ్యన మహాత్ముని చిత్రపటం పెట్టి పూజలు నిర్వహిస్తుంటారు. గాంధీకి పూజలు చేసిన తర్వాత.. పొలం పనులు ప్రారంభిస్తే అంతా మేలు జరుగుతుందని వారి నమ్మకం.
ఇది కూడా చదవండి : జిల్లాలో 16 వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు