road works stopped: ఏపీ పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం కొంకడివరం సమీపంలో ఐటీడీఏ, ఉపాధి హామీ నిధులతో అక్రమంగా చేపట్టిన రహదారి నిర్మాణాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామంలోని ఎగువ చెరువు, కొమ్మోజువాని చెరువు, జీరాయితి భూముల మీదుగా పంచాయతీ అనుమతులు లేకుండా రహదారి పనులు చేపట్టారు. అయితే సమీపంలో ఉన్న క్రషర్లు, క్వారీల మైనింగ్ కోసం ఐటీడీఏ నిధులతో రహదారి నిర్మాణం చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రహదారి పనులు పర్యవేక్షణకు వచ్చిన పార్వతీపురం ఐటీడీఏ ఈఈ శాంతేశ్వరరావు, ఐటీడీఏ సిబ్బందిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి జనసేన నాయకులు మద్దతు పలికారు. దీంతో అధికారులు అక్కడినుంచి వెనుదిరిగారు.
ఇదీ చదవండి: హైదరాబాద్ శివార్లలో భారీ వర్షం.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి