రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వేళ కొందరు యువకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కనబడటం లేదంటూ ఆ నియోజకవర్గానికి చెందిన కొందరు యువకులు శాసనసభను ముట్టడించేందుకు ప్రయత్నించారు.
అప్రమత్తమైన పోలీసులు యువకులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా.. కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి గోషామహల్ పీఎస్కు తరలించారు.