ETV Bharat / city

ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నిర్ణయం తీసుకోండి: హైకోర్టు - ap bifuracation act says hc to central

ఏపీ పునర్విభజన జరిగి ఆరేళ్లు గడుస్తున్నా.. పోలీస్​ శాఖలో తుది కేటాయింపులు జరగకపోవడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు.. కేవలం సలహాతోనే కేంద్రం సరిపెట్టుకుంటుందా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం కల్పించిన అధికారాన్ని వినియోగించి.. ఆరు వారాల్లోగా కేటాయింపులు పూర్తిచేయాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

telangana high court
ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
author img

By

Published : Aug 19, 2020, 10:33 PM IST

ఏపీ పునర్విభజన సలహా కమిటీ సూచనలతో పోలీస్​ శాఖలో తుది కేటాయింపులు జరపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. విభజన జరిగి ఆరేళ్లు గడుస్తున్నా.. పోలీస్​ శాఖపై కేంద్రం ప్రేక్షక పాత్ర వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తుది కేటాయింపుల్లో ఇరు రాష్ట్రాల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు.. కేవలం సలహాతోనే సరిపెట్టుకుంటుందా.. అని కేంద్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం కల్పించిన అధికారాన్ని వినియోగించి.. నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ మొత్తం ప్రక్రియ.. తీర్పు ప్రతి అందిన ఆరు వారాల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇందుకు తెలంగాణ, ఏపీ డీజీపీలు సహకరించాలని సూచించింది.

ఎస్పీల కేటగిరీలో ఉన్న తమను మాతృ రాష్ట్రానికి పంపకపోవడం.. తుది కేటాయింపులు చేయకపోవడాన్ని సవాల్​ చేస్తూ హైదరాబాద్​లోని చార్మినార్ ట్రాఫిక్ ఎసీపీ జి.నాగన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

1989లో కర్నూలులో ఎస్సైగా నియమితులై 2009లో డీఎస్పీగా పదోన్నతి పొందాను. రాష్ట్ర విభజన ప్రక్రియలో తనతోపాటు మరో 10 మంది డీఎస్పీలను.. తెలంగాణకు తాత్కాలిక ప్రాతిపదికన కేటాయించారు. తెలంగాణకు బలవంతంగా ఐచ్ఛికం ఇప్పించారు. ఉపసంహరించుకుంటున్నానని 2017లో రెండుసార్లు సలహా కమిటీకి వినతి పత్రం ఇచ్చినా.. 2017లో ఏపీ డీజీపీ రిలీవ్ చేయగా తెలంగాణలో విధుల్లో చేరారు. పిటిషన్ పెండింగ్​లో ఉండగానే ఈ ఏడాది ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశాను. ఇప్పటికీ తుది కేటాయింపులు పూర్తికాలేదని.. అప్పట్లోనే కేటాయింపులు జరిగి ఉంటే ఏపీకి వెళ్లే వాడినన్నారు. 60 ఏళ్ల సర్వీస్​ ఉండేదని తెలిపారు. తెలంగాణలో ఉండిపోవడం వల్ల ఆ ప్రయోజనం పొందలేకపోయానంటూ ..హైకోర్టులో నాగన్న పిటిషన్​ దాఖలు చేశారు.

అందరికీ వర్తిస్తుంది..

ఈ వ్యాజ్యంపై ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్​ ఎం.ఎస్​.రామచంద్రరావు, జస్టిస్​ టి. అమర్​నాథ్​ గౌట్లతో కూడిన ధర్నాసనం 37 పేజీల తీర్పును వెలువరించింది. ఈ పిటిషన్ ఒక వ్యక్తికి చెందినదే అయినా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసే అధికారులందరికీ వర్తిస్తుందని న్యాయస్థానం పేర్కొంది. అందువల్ల ఈ కేసును ఒక వ్యక్తికి చెందిన కేసుగా పరిగణించలేమంది.

అవకాశాలు ఇచ్చినా..

రాష్ట్ర విభజన జరిగి ఆరేళ్లు గడిచినా.. తుది కేటాయింపులు జరగకపోవడం.. తాత్కాలిక ప్రాతిపదికన కేటాయింపుల్లో ఉన్నవారిలో అనిశ్చితి ఉంటుందని పేర్కొంది. పదవీ విరమణ వయసు, పదోన్నతులు, పోస్టింగ్​లు, క్రమశిక్షణ చర్యలు, పదవీ విరమణ ప్రయోజనాలు తదితర అంశాల్లో వారికి ఆవేదన కలిగిస్తుందని తెలిపింది. తుది కేటాయింపులకు తెలంగాణ సహకరించకపోవడానికి గల కారణాలపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదికి పలు అవకాశాలు ఇచ్చినా.. వాదనలు వినిపించలేదంది.

కేంద్రం ప్రేక్షక పాత్ర పోషిస్తోందా..?

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నేరాలు, కేసుల దర్యాప్తు తదితర అంశాలకు సంబంధించి.. ప్రజాప్రయోజనం ఉన్నప్పటికీ చొరవ తీసుకునే బాధ్యత లేదా అంటూ కేంద్రాన్ని నిలదీసింది. ఏపీ ప్రభుత్వం రూపొందించిన సీనియారిటి జాబితాను తెలంగాణ తిరస్కరించిందన్న కారణంగా.. కేంద్రం ప్రేక్షక పాత్ర పోషించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కేంద్రానికి ఆరు వారాల గడువిచ్చినా.. కౌంటర్​ దాఖలు చేయలేదంది.

ఆరు వారాల్లోగా డీఎస్పీ, ఏఎస్పీ, ఎస్పీ కేటగిరీ పోస్టుల తుది కేటాయింపులు జరిగేలా చర్యలకు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా సలహా కమిటీ.. ఎస్పీలు, అదనపు ఎస్పీల నుంచి తాజా ఐచ్ఛికాలను ఆహ్వానించే అవకాశం కూడా ఉందని పేర్కొంది.

చెరో ఐదు వేలు చెల్లించండి..

తాత్కాలిక కేటాయింపునకు సంబంధించి పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించింది. తుది కేటాయింపులు పూర్తయ్యాక.. పిటిషనర్​ను ఏపీకి కేటాయిస్తే, అతనికి 60 ఏళ్లు వచ్చే వరకు విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర, తెలంగాణ ప్రభుత్వం.. పిటిషనకు ఖర్చుల కింద రూ.5 వేలు కేటాయించాలంటూ ఉత్తర్వులు జారీచేసింది.

ఇవీచూడండి: చిన్నారి వైద్యానికి.. సాయం చేసిన సిరిసిల్ల ఎస్పీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.