ETV Bharat / city

తెలంగాణ అన్నదాతకు మళ్లీ యూరియా కష్టాలు

నైరుతి ఆగమనం ఆలస్యంతో అన్నదాత నిరాశ చెందాడు. ఎట్టకేలకు వరుణుడు కరుణించి చెరువులు, ప్రాజెక్టులు నింపాడు. రైతు ఆనందంతో పొలం బాట పట్టాడు. నాట్లు పూర్తై పంట ఏపుగా పెరుగుతుందన్న దశలో యూరియా రూపంలో అసలు కష్టాలు చుట్టుముట్టాయి. అధికారుల అలసత్వం, దళారీల దోపిడీ వెరసి రైతును దిక్కుతోచని స్థితికి నెట్టాయి. ఈక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న యూరియా కొరతపై "ఈటీవీ భారత్" ప్రత్యేక​ కథనం...

author img

By

Published : Sep 3, 2019, 8:04 PM IST

Updated : Sep 3, 2019, 8:59 PM IST

అన్నదాత అగచాట్లు... యూరియా కోసం పడరానిపాట్లు

రాష్ట్ర వ్యాప్తంగా రైతుల యూరియా కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. వేకువ మొదలు సూర్యాస్తమయం వరకు పొలం గట్టున ఉండే రైతన్న ఎరువుల కోసం సహకార సంఘాల వద్ద, ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నాడు. ఖరీఫ్‌ సీజన్‌లో వరి నాటువేసిన 15 రోజులకు మొదటి దఫా యూరియా చల్లాలి. కానీ ఇప్పటికీ చాలా చోట్ల సరిపడ యూరియా పంపిణీ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కాడి వదిలి కార్యాలయాల చుట్టు ప్రదక్షిణలు..

అన్ని జిల్లాల్లో యూరియా కొరత వేధిస్తోంది. కొన్నిచోట్ల రైతులు వేకువజామునే దుకాణాల వద్దకు చేరుకుని ఒక్క బస్తా అయినా దొరక్కపోతుందా అని చెప్పులను వరుసలో పెట్టి మరీ ఎదురు చూస్తున్నారు. పురుషులతోపాటు మహిళా రైతులు కూడా అన్ని పనులు మానుకుని క్యూలైన్లోనే పడిగాపులు కాస్తున్నారు.

వెల్లువెత్తుతున్న నిరసనలు

నిజామాబాద్​ జిల్లా ధర్పల్లి మండలంలోని సొసైటీ వద్ద యూరియా కోసం వచ్చిన రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. కొన్నిచోట్ల పోలీసు బందోబస్తు పెట్టి మరీ యూరియా పంపిణీ చేస్తున్నారు. కొన్ని మండలాల్లో సరిపడ యూరియా లేక అన్నదాతలు నిరసన బాట పట్టారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అరకొరగా పంపిణీ...

కేంద్రం నుంచి రాష్ట్రానికి కేటాయించిన యూరియా మొత్తం రాష్ట్రానికి చేరలేదు. దీనికితోడు ఏటా పెరుగుతున్న సాగుకు సరిపడా ఎరువుల సరఫరా పెంచకపోవడం వల్ల ఊహించని స్థాయిలో కొరత ఏర్పడింది. దీనితో కొందరు యూరియాతో ఇంటికెళుతుంటే... ఎక్కువ మంది మాత్రం ఖాళీ చేతులో వెనుదిరగాల్సి వస్తోంది. ఇదే అదనుగా భావించిన ప్రైవేటు దళారీలు కృత్రిమ కొరత సృష్టించి అందినకాడికి దోచుకుంటున్నారు.

అవస్థల సాగును నెట్టుకొస్తున్న రైతుకు ప్రతిఏటా ఏదో తెలియని కష్టం వచ్చి పడుతోంది. ఈసారి కాస్త ఆలస్యమైనా... ప్రకృతి కరుణించిందని అశ పడిన అన్నదాతకు అధికారుల తీరులో ప్రమాదం వచ్చి పడింది. ఈ విపత్తు నుంచి కర్షకుడు గట్టెక్కాలని ఆశిద్దాం...

తెలంగాణ అన్నదాతకు మళ్లీ యూరియా కష్టాలు

ఇదీ చూడండి: అన్నదాతను భయపెడుతున్న 'ఎరువుల కరవు'

Intro:Body:

yuriya...

Conclusion:
Last Updated : Sep 3, 2019, 8:59 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.