తెలంగాణలో ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలంటూ... పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నిరుద్యోగులు చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి...... అరెస్టులకు దారి తీసింది. నిరుద్యోగులకు వయసు మీరిపోతున్నప్పటికీ.. ఈ ఏడాది ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని నినాదాలు చేస్తూ నిరుద్యోగులు.... ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. అక్కడి డివైడర్‌ను ఎక్కి సీఎం కార్యాలయంవైపు పరుగులు తీసిన..... విద్యార్థి, యువజన సంఘాల కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు.
ఎంతో మంది నిరుద్యోగులు... ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని నినదించారు. రాష్ట వ్యాప్తంగా ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: rs praveen kumar: 'రాజ్యాంగం రాసిందే మా తాత.. అదేలేకపోతే నువ్వెక్కడ కేసీఆర్'