ETV Bharat / city

'దేశ సేవ చేస్తుంటే చూడాలనుకున్నారు.. జైల్లో మగ్గుతుంటే చూడలేకపోతున్నారు..'

Secunderabad Agnipath case: తమ పిల్లలు సైన్యంలో చేరి దేశ సేవ చేస్తుంటే చూడాలనుకున్న తల్లిదండ్రులు వాళ్లు. దేశానికి, పుట్టిన ఊరికి, తమకూ మంచి పేరు తెస్తారని ఎన్నో కలలు కన్నారు. కూలీనాలీ చేసుకుని పిల్లలను పెంచి పెద్ద చేశారు. పరీక్ష రాసొస్తామని చెప్పి వెళ్లిన పిల్లలు.. జైల్లో పడటంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. చంచల్‌గూడ జైలు వద్ద కన్నీరుమున్నీరవుతున్నారు.

Secunderabad Agnipath Case
Secunderabad Agnipath Case
author img

By

Published : Jun 20, 2022, 10:33 AM IST

Updated : Jun 20, 2022, 5:29 PM IST

Secunderabad Agnipath Case: వారు ఒకటి కోరుకుంటే.. విధి ఇంకోటి తలచింది. తమ పిల్లలు దేశానికి సేవ చేస్తారనుకుంటే.. జైలు జీవితం అనుభవిస్తుండటం చూస్తూ గుండెలవిసేలా రోదిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా గత శుక్రవారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన హింసలో.. పోలీసులు 46 మందిని అరెస్టు చేశారు. రైలు బోగీలకు నిప్పు పెట్టడం, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం కేసుల్లో వారిని హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో పెట్టారు. పరీక్ష రాసొస్తానని చెప్పి ఊరి నుంచి సికింద్రాబాద్‌కు వచ్చిన పిల్లల గురించి ఆనాటి నుంచి వారి తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం లేదు. ఎవరో చెప్పిన సమాచారంతో వారి పిల్లలు జైలులో ఉన్నారని తెలుసుకుని తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

విధ్వంసకాండ కేసులో 46 మంది అరెస్టు కాగా.. జైలులో ఉన్న నిందితులను కలిసేందుకు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు చంచల్‌గూడ జైలుకు వచ్చారు. ములాఖత్‌లో భాగంగా కొందరు తమ పిల్లలను కలుసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. తమ పిల్లలకు కేసుతో ఎలాంటి సంబంధం లేదని.. తమ పిల్లలను విడుదల చేయాలని తల్లిదండ్రులు విలపించారు.

ఈ సందర్భంగా తమ కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని ఒకరు.. తమ కుమారుడికి ఏమీ తెలియదని మరొకరు.. తప్పు చేసి ఉంటే క్షమించండి కానీ.. తమ కుమారుడి భవిష్యత్తును పాడు చేయొద్దంటూ ఇంకొకరు వేడుకుంటున్నారు. నెల రోజుల్లో జాబ్​ వస్తుందని వెళ్లి.. కటకటాలపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు కావాలని చేయలేదని.. ఎవరో వాళ్లను ఉసిగొల్పారని ఆరోపిస్తున్నారు. తమ కుమారులు రాళ్లు రువ్వలేదని, బోగీలకు నిప్పు పెట్టలేదని అంటున్నారు. విధ్వంసకాండలో భాగమైన వారిని అరెస్టు చేసి శిక్షించాలని... సమగ్ర విచారణ జరిపించి అమాయకులను విడుదల చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

అసలేం జరిగిందంటే.. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ... సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో నిరసనకారులు ఆందోళనకు దిగారు. రైలు బోగిలకు నిప్పుపెట్టడంతోపాటు... స్టేషన్‌ బయట ఉన్న ఆర్టీసీ బస్సులపై దాడులు చేశారు. ఆందోళనకారుల నిరసనలతో... సికింద్రాబాద్ ప్రాంగణం అట్టుడికిపోయింది. అగ్నిపథ్‌ గురించి ప్రకటన వచ్చినప్పటి నుంచి ఆందోళనకారులు నిరసనకు ప్రణాళిక వేసినట్లు తెలిసింది. తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి యువకులు రాత్రే హైదరాబాద్‌ వచ్చినట్లు సమాచారం.

వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా సమాచారాన్ని ఆందోనకారులు యువతకు చేరవేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. జిల్లాల వారీగా ఆందోనకారులు వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిరసనకు ఆందోళనకారులు నిన్న రాత్రే వచ్చినట్లు వెల్లడించారు. స్టేషన్ బయట ఓ బస్సు అద్దాలు పగుల గొట్టి.. ఉదయం 9 గంటల వేళ ఒక్కసారిగా స్టేషన్లోకి దూసుకొచ్చినట్లు చెప్పారు. మరోవైపు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను నిరసనకారులు ధ్వంసం చేశారు. రైల్వేస్టేషన్‌లో లోపలికి చొచ్చుకెళ్లి ఫ్లాట్‌ఫారమ్ మీద ఉన్న రైళ్లపై రాళ్లు విసిరారు. పట్టాల మధ్యలో నిప్పు పెట్టారు.

Last Updated : Jun 20, 2022, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.