తెరాస తరఫున కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు రేపు అభినందన సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్కు రావాలని కార్పొరేటర్లకు సమాచారం ఇచ్చారు. విజేతలను అభినందించి... వారందరితో కేటీఆర్ ఫోటోలు దిగనున్నారు.
ప్రజా ప్రతినిధులుగా రానున్న ఐదేళ్ల పాటు ప్రజలతో ఎలా మెలగాలో కేటీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. అవినీతికి దూరం ఉండాలని... ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టాలని కేటీఆర్ కోరనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నారు.
ఇదీ చూడండి: తెలంగాణలోని ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ: కేటీఆర్