ETV Bharat / city

ఆర్టీసీలో కార్మిక సంఘాల సమ్మె సైరన్‌

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాటపడుతున్నారు. ఇప్పటికే ఆర్టీసీ టీజేఎంయూ, ఎంప్లాయిస్ యూనియన్‌లు యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చాయి. మరో రెండు రోజుల్లో తెలంగాణ మజ్థూర్ యూనియన్ కూడా యాజమాన్యానికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని వీరు ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు.

author img

By

Published : Sep 4, 2019, 4:44 AM IST

Updated : Sep 4, 2019, 7:42 AM IST

ఆర్టీసీలో కార్మిక సంఘాల సమ్మె సైరన్‌
ఆర్టీసీలో కార్మిక సంఘాల సమ్మె సైరన్‌

తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘాలు ఒక్కొక్కటిగా సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు సంఘాలు బస్ భవన్​లో ఆర్టీసీ ఉన్నతాధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారు. ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లు తమ ఉద్యోగ విషయంలో అభద్రతా భావానికి లోనవుతున్నారని... వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఈయూ నేతలు యాజమాన్యాన్ని కోరారు. 2017 వేతన సవరణ నేటి వరకు అమలు చేయడంలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.

సమ్మె నోటీసులు ఇచ్చిన టీజేఎంయూ, ఎంప్లాయిస్‌ యూనియన్‌...
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినపుడే కష్టాలు తీరుతాయని కార్మికులు భావిస్తున్నారు. అది నెరవేరే వరకూ పోరాడతామని స్పష్టం చేస్తున్నారు. ఇటీవలే టీజేఎంయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలని యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చారు. టీఎంయూ నాయకులు కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని విన్నపం...
సంస్థకు పూర్తిస్థాయిలో సీఎండీ లేకపోవడం వల్ల ఎవరూ పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నష్టాలు భారీగా పెరిగిపోవడం వల్ల జీతాలు కూడా సరిగా ఇవ్వలేని స్థితికి ఆర్టీసీ చేరుకుందని కార్మిక సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈనెల 17 తర్వాత ఎప్పుడైనా సమ్మె...?
ప్రభుత్వం కార్మిక సంఘాల నాయకులతో చర్చల ద్వారా సమ్మెలను విరమింపజేసే అవకాశం ఉంది. స్పందన రాకుంటే మాత్రం తీవ్ర స్థాయిలో సమ్మె నిర్వహిస్తామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈనెల 17 తర్వాత ఎప్పుడైనా తాము సమ్మెలోకి వెళతామని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: చార్మినార్​ జోన్​లోకి వికారాబాద్ జిల్లా!

Intro:Body:Conclusion:
Last Updated : Sep 4, 2019, 7:42 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.