ETV Bharat / city

టాప్​టెన్​ ​న్యూస్​ @5PM - topten news @5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @5PM
టాప్​టెన్​ ​న్యూస్​ @5PM
author img

By

Published : Jan 28, 2021, 5:01 PM IST

1. త్వరలో భృతి..!

రాష్ట్రంలోని నిరుద్యోగులకు త్వరలో శుభవార్త చెప్పనున్నట్టు మంత్రి కేటీఆర్​ వ్యాఖ్యానించారు. రేపోమాపో ముఖ్యమంత్రి కేసీఆర్​ నిరుద్యోగ భృతి ప్రకటించనున్నట్టు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. విద్యుత్ ఉద్యోగుల శ్రమతో..

రాష్ట్రావతరణ అనంతరం తొలి ప్రాధాన్యతగా విద్యుత్ సమస్యను పరిష్కరించినట్టు... కేటీఆర్​ అన్నారు. విద్యుత్ కార్మిక సంఘం సమావేశానికి హాజరైన మంత్రి... ప్రత్యేక ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగులు కీలకపాత్ర పోషించారని కొనియాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. తిరగబడాలి..

తెలంగాణ వచ్చాక ఉద్యోగులను సీఎం కేసీఆర్​ మోసం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​కుమార్​ రెడ్డి ఆరోపించారు. ఉద్యోగులకు 43శాతం తగ్గకుండా ఫిట్​మెంట్​ ఇవ్వాలని ఆయన డిమాండ్​ చేశారు. లేకపోతే ఆందోళనలకు కాంగ్రెస్​ అండగా ఉంటుందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. అది నేరమేం కాదు..

పోక్సో చట్టం ప్రకారం దుస్తులపై కాకుండా, నేరుగా శరీరాన్ని తాకితేనే లైంగిక దాడిగా పరిగణించాలని వివాదాస్పద తీర్పు ఇచ్చిన బాంబే హైకోర్టు న్యాయమూర్తి మరోసారి అలాంటి తీర్పే వెలువరించారు. మైనర్‌ బాలిక చేయి పట్టుకోవటం, ప్యాంటు జిప్పు విప్పడం పోక్సో చట్టం ప్రకారం లైంగిక దాడిగా భావించలేమని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. కేంద్రానికి నోటీసులు..

కొత్త వ్యవసాయ చట్టాల రాజ్యాంగబద్ధతను సవాల్​ చేస్తూ కేరళ​ ఎంపీ దాఖలు చేసిన వ్యాజ్యంపై కేంద్రానికి నోటీసులు ఇచ్చింది సుప్రీం కోర్టు. తమ స్పందన తెలియజేయాలని ఆదేశించింది. తాజా పిటిషన్​ను పెండింగ్​లో ఉన్న పిటిషన్​లతో జత చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. దేశద్రోహం కేసు..

దిల్లీ అల్లర్లలో నిందితులపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు పోలీసులు. ఎర్రకోట ఘటనపై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. ట్రాక్టర్​ ర్యాలీలో నిబంధనల ఉల్లఘనలపై ఇప్పటికే 20 మంది నాయకులకు లుక్​అవుట్​ నోటీసులు జారీ అయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. అవినీతి మరక..

కరోనా మహమ్మారిపై దేశాలు స్పందించిన తీరుకు.. అవినీతికి లింకు ఉందంటోంది ఓ సర్వే. వైద్య, ఆరోగ్య రంగాల్లో భారీగా నిధులు సమకూర్చిన దేశాల్లో కరోనా కట్టడి సాధ్యమైనట్లు తెలిపింది. అవినీతిపై అంచనాల్లో ఏ దేశం ఏ స్థానంలో ఉందో చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. నష్టాల్లో మార్కెట్..

స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజూ భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 535 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ 150 పాయింట్లు కోల్పోయింది. బ్యాంకింగ్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. అసాధ్యమే..!

ప్రపంచ బ్మాడ్మింటన్​ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్​ టూర్​ ఫైనల్స్​లో భారత షట్లర్లకు మరోసారి నిరాశ తప్పలేదు. గురువారం జరిగిన గ్రూప్​ దశ రెండో మ్యాచ్​లో పీవీ సింధు, శ్రీకాంత్​ ఓటమి పాలయ్యారు. దీంతో నాకౌట్​ చేరడం దాదాపు అసాధ్యంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. వారి నుంచే నేర్చుకున్నా..

ప్రముఖ వ్యాఖ్యాత ప్రదీప్​ హీరోగా పరిచయమవుతున్న చిత్రం '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?'. ఈ సినిమా శుక్రవారం (జనవరి 29) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈటీవీ భారత్​తో ప్రదీప్​ ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.