1. వీడు మామూలోడు కాడు
ఇసుక తిన్నెల్లో ఓ బాలుడు ఔరా అనిపించేలా ఫీట్లు చేస్తున్నాడు. ఆ వీడియో ట్విట్టర్లో చక్కర్లు కొడుతోంది. ఆ బాలుడి అద్భుత ఫీట్లకు మనమే కాదు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే మంత్రి కేటీఆర్ కూడా ఫిదా అయ్యారు. ఫ్యూచర్ ఒలింపిక్ మెడలిస్ట్ అంటూ కితాబిచ్చారు. అలాగే కిలిమాంజారో పర్వతాన్ని అధిరోహించిన తరుణ్జోషీకి అభినందనలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'పద్య ప్రభంజనం'
హైదరాబాద్ తెలంగాణ సారస్వత పరిషత్తు సమావేశ మందిరంలో 610కి పైగా కవుల భాగస్వామ్యంతో వెలువరించిన పద్య ప్రభంజనం అనే గ్రంథాన్ని కవిత ఆవిష్కరించారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో మరిన్ని సంకలనాలు రావాలని ఆమె ఆకాక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. పద్దులో 'ఆరోగ్యం' వాటా..?
కేంద్రం త్వరలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి పద్దు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అన్ని రంగాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. అయితే అన్నింటికన్నా ఆరోగ్య రంగానికి భారీగా కేటాయింపులు ఉండొచ్చని హెల్త్‌కేర్ విభాగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిచ్చే విధంగా కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఇక వాటికే గుర్తింపు..
కొత్తగా తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానంతో వ్యవస్థలో కీలక మార్పులకు తెర తీసింది సీబీఎస్ఈ. ఇకపై ఈ సంస్థ అనుబంధ పాఠశాలగా కొనసాగాలంటే ఆయా సంస్థలు పూర్తి స్థాయిలో డిజిటలీకరణ చెందాల్సిన అవసరం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. రూ. 1,100 కోట్లు దాటొచ్చు..!
అయోధ్యలో రామ మందిర నిర్మాణం 3 సంవత్సరాల్లో పూర్తవుతుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ తెలిపారు. నిర్మాణ వ్యయం రూ. 1100కోట్లు దాటుతుందని అంచనా వేశారు. దేశవ్యాప్తంగా 15కోట్ల కుటుంబాల వద్దకు వెళ్లి విరాళాలు సేకరించటమే తమ లక్ష్యమని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. ఉగ్రవాదులు గుడ్ బై..
సమాచార మార్పిడిలో గోప్యతకు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు ఉగ్రవాదులు. ఇప్పటికే వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ప్రైవసీ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లోని ఉగ్రసంస్థలతో చర్చించేందుకు కొత్త మెసేజింగ్ యాప్‌లను వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. అమానవీయం..
జాతీయ బాలికా దినోత్సవం రోజు యూపీలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఓ ఆడ శిశువును రోడ్డు పక్కనే ఉన్న ఓ గుంతలో విసిరేసి వెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు. ఆ పసికందు ఏడుపు విని.. స్థానిక ఆస్పత్రికి తరలించారు స్థానికులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. ఇద్దరు సురక్షితం
చైనాలోని ఓ బంగారు గనిలో ఈ నెల 10న జరిగిన పేలుడు కారణంగా అందులో చిక్కుకుపోయిన కార్మికుల్లో మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మరో 11 మంది ఆ గనిలోనే ఉండగా.. వారిని బయటకు తీసేందుకు చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. టిమ్‌పైన్ వల్లే గెలిచాం..
టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా చారిత్రక విజయం సాధించడానికి ఆస్ట్రేలియా సారథి టిమ్‌పైన్ ఓ కారణమని అన్నాడు భారత బౌలర్ అశ్విన్. అతడు చేసిన తప్పిదాల వల్లే భారత్ గెలిచిందని వ్యంగ్యస్త్రాలు సంధించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. వసూళ్ల మాస్టర్..
విజయ్-విజయ్ సేతుపతి నటించిన 'మాస్టర్'.. భారీ కలెక్షన్లతో బాక్సాఫీసును పరుగులు పెట్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.211 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.