ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @5PM - Telangana news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @5pm
టాప్​టెన్​ న్యూస్​ @5PM
author img

By

Published : Dec 22, 2020, 5:00 PM IST

1. భయమక్కర్లేదు..

కొత్త రకం వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. త్వరలో క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలు ఉన్నందున... కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. త్వరలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని... పంపిణీకి శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. రుణ యాప్​లపై కొరడా..

రుణ యాప్​ల దందాపై సైబరాబాద్​ పోలీసులు కొరడా ఝళిపించారు. దా'రుణ' యాప్​ల ద్వారా వేధింపులకు పాల్పడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 22 చరవాణులు, 3 కంప్యూటర్లు, 3 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. రూ.1.52 కోట్లు నిల్వ ఉన్న 18 బ్యాంకు ఖాతాలు నిలుపుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. ప్రభుత్వం అవమానిస్తోంది..

హైదరాబాద్​ ఇందిరాపార్కు ధర్నాచౌక్​ వద్ద రాజీవ్​ గాంధీ పంచాయతీరాజ్​ సంఘటన ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యగ్రహ దీక్షలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెరాస ప్రభుత్వంపై భట్టి ధ్వజమెత్తారు. స్థానిక ప్రజా ప్రతినిధులను తెరాస ప్రభుత్వం అవమానిస్తోందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. రాకపోతే తప్పుకుంటారా..?

భాజపా నాయకులకు మరో సవాల్ విసిరారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్​. బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లు రాకపోతే ఆ పార్టీ నేతలు పదవుల నుంచి తప్పుకుంటారా? అని ఛాలెంజ్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. చర్యలేవీ..?

న్యాయస్థానాన్ని ఆలస్యంగా ఆశ్రయిస్తున్న ప్రభుత్వ అధికారులపై సుప్రీంకోర్టు మండిపడింది. ఏదో లాంఛనప్రాయంగా కోర్టులో అపీళ్లు దాఖలు చేస్తున్నారని చీవాట్లు పెట్టింది. ఓ తీర్పుపై 462 రోజులు ఆలస్యంగా సవాలు చేసిన పిటిషనర్​కు రూ.15 వేలు జరిమానా విధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 28 ఏళ్లకు తీర్పు..

సిస్టర్​ అభయ కేసు ఎట్టకేలకు చిక్కుముడి వీడింది. ఫాదర్‌ థామస్‌ కొట్టూర్‌, నన్‌ సెఫీని సీబీఐ న్యాయస్థానం దోషులుగా ప్రకటించింది. ఈ నెల 23న శిక్ష ఖరారు చేయనున్నట్లు వెల్లడించింది. తీర్పుపై మానవ హక్కుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. మృత్యుఘోష..

ప్రపంచవ్యాప్తంగా కరోనా రెండో దఫా విజృంభణ కొనసాగుతోన్న నేపథ్యంలో ఇటలీలో కొవిడ్​ మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రోజుకు సరాసరి 600 మంది మహమ్మారితో ప్రాణాలు వదులుతున్నారు. మిగతా అన్ని దేశాలతో పోల్చితే ఇటలీలోనే కొవిడ్​ మరణాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వృద్ధ జనాభా ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు చనిపోతున్నారని పలు నివేదికలు వెల్లడించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. లాభాల ముగింపు..

ఐటీ, ఫార్మా షేర్ల దన్నుతో స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 453 పాయింట్లు బలపడి తిరిగి 46 మార్క్ దాటింది. నిఫ్టీ 138 పాయింట్లు పుంజుకుని 13,450 పైకి చేరింది. హెచ్​సీఎల్​టెక్ అత్యధికంగా 5 శాతానికిపైగా లాభాన్ని గడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఒలంపిక్స్ జరిగేనా..?

టోక్యో ఒలింపిక్స్ తాజా​ వ్యయాన్ని స్థానిక నిర్వహక కమిటీ వెల్లడించింది. గతేడాది కంటే 22 శాతం పెరిగినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. రకుల్​కు కరోనా..

హీరోయిన్​ రకుల్​ ప్రీత్​ సింగ్​కు కరోనా సోకింది. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు చెప్పిన ఈ ముద్దుగుమ్మ.. ఐసోలేషన్​లో ఉన్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.