1. అదంతా అబద్ధం
నాలుగు ఓట్లు వస్తాయన్న ఆశతో సామాజిక మాధ్యమాల్లో భాజపా తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఎన్నికల సంఘం కార్యాలయం ముందు భాజపా ధర్నా డ్రామా అని ఆయన అభివర్ణించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం భాజపా తరఫున 12 మంది కేంద్ర మంత్రులు, జాతీయ అధ్యక్షుడు, ప్రధానిని కూడా తీసుకొచ్చారన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. బందోబస్తు
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాట్లు పూర్తి చేశామని సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు చేసినట్లు వెల్లడించారు. ప్రతీ ఒక్కరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కరోనాపై అఖిలపక్షం
దేశంలో కరోనా వ్యాప్తిపై చర్చించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షత డిసెంబర్ 4న అఖిలపక్ష భేటీ జరగనుంది. ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ సమావేశానికి ఉభయ సభల నుంచి అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించనున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. మిషన్ ఆప్ ద సెంచరీ
కరోనా కట్టడికి వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి వస్తుందన్న వార్తలు ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిస్తున్నాయి. కానీ కరోనా టీకా అందుబాటులోకి వస్తే దాన్ని ప్రపంచం నలుమూలలకు వేగంగా ఎలా సరఫరా చేయాలన్న సవాల్.. అనేక దేశాలను కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా టీకాను సరఫరా చేసేందుకు విమానయాన సంస్థలు 'మిషన్ ఆఫ్ ద సెంచరీ' చేపట్టేందుకు సమాయత్తమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. రాహుల్ 2.0
కాంగ్రెస్‌కు నూతనోత్తేజం నింపే దిశగా రాహుల్ గాంధీ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు చెందిన నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు రాహుల్. పార్టీ అనుబంధంగా ఉన్న యువజన, విద్యార్థి సంఘాలతో భేటీ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపైనా వరుస విమర్శలు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. 71 ఏళ్ల తర్వాత..
దిల్లీలో సుమారు 71ఏళ్ల తరువాత ఈ నవంబరులో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ)వెల్లడించింది. ఈ ఏడాదికి గాను సగటు అత్యల్ప ఉష్ణోగ్రత 10.2 డిగ్రీలుగా నమోదైనట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ఉగ్రవాద నిర్మూలనతోనే..
షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల అధినేతల 19వ సమావేశానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అధ్యక్షత వహించారు. పాకిస్థాన్‌పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ఎస్సీఓ చార్టర్‌కు విరుద్ధంగా ద్వైపాక్షిక అంశాలను కొన్ని దేశాలు ప్రస్తావించడం సరికాదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. డ్రాగన్ దూకుడు..
కరోనా దెబ్బకు పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, ఐరోపాలు చతికిలబడ్డాయి. అయితే చైనా మాత్రం కొవిడ్‌ను ఎదిరించి నిలిచి తయారీరంగంలో దూకుడు చూపిస్తోంది. నవంబర్ నెలలో పరిశ్రమల ఉత్పత్తి సూచీలో గణనీయమైన అభివృద్ధి కనపించినట్లు ఓ సర్వేలో తేలింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. సిరీస్ కవీస్‌దే
బే ఓవల్‌లోని మూడో టీ20 వర్షం వల్ల రద్దయింది. దీంతో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో కివీస్ విజేతగా నిలిచింది. గురువారం ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. 50 రాత్రుల్లో ఫైట్
లాక్డౌన్ తర్వాత తిరిగి మొదలైన 'ఆర్ఆర్ఆర్'.. ఓ షెడ్యూల్‌నూ పూర్తి చేసుకుంది. ఇందులో భారీ పోరాటాన్ని చిత్రీకరించారు. త్వరలో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.